Ads
దసరా సెలవులు ఒకపక్క.. వీకెండ్ ఒకపక్క.. కాస్త లేట్ చేసినా స్టార్ హీరోల సినిమాలు స్టార్ట్ అవుతాయేమో అన్న ఉద్దేశంతో జయం రవి, నయనతార కాంబినేషన్ లో వచ్చిన గాడ్ ఈరోజు విడుదల చేసేసారు.సై-కో థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం పదండి..
- మూవీ: గాడ్
- నటీనటులు: జయం రవి, నయనతార, నరైన్, ఆశిష్ విద్యార్థి, వినోద్ కిషన్,రాహుల్ బోస్, విజయలక్ష్మి
- ఛాయాగ్రహణం: హరి కె. వేదాంతం
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- దర్శకత్వం: ఐ. అహ్మద్
- నిర్మాతలు: సుధన్ సుందరం, జి.జయరాం, సి. హెచ్. సతీష్ కుమార్
- విడుదల తేదీ: 13-10-2023
స్టోరీ:
ఇంతకీ స్టోరీ ఏమిటంటే..అర్జున్ (జయం రవి) ఒక బాధ్యతాయుతమైన అసిస్టెంట్ పోలీస్ కమిషనర్. భయం అంటే తెలియదు ..మరోపక్క కోపం దూకుడు రెండు ఎక్కువే…నేరస్తుల్ని పట్టుకోవడానికి అవసరమైతే చట్టాన్ని పక్కన కూడా పెట్టేస్తాడు. అతనితోపాటు కలిసి పనిచేసే ఆతని ఫ్రెండ్ ఆండ్రూ (నరైన్) అంటే అతనికి చాలా ఇష్టం.
అతని కుటుంబాన్ని కూడా సొంత కుటుంబంగా చూస్తూ జీవితాన్ని హ్యాపీగా గడుపుతుంటాడు. అయితే సడన్ గా ఒక సై-కో ఎంట్రీ ఇవ్వడంతో ఇతని జీవితంలో అనుకొని కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. స్మైలింగ్ కి-ల్ల-ర్ బ్రహ్మ (రాహుల్ బోస్) .. సిటీలోని అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. అత్యంత కిరాతకంగా వాళ్ళను చంపి ఆనందించే ఒక సై-కో కిల్లర్. ఈ నేపథ్యంలో అతన్ని పట్టుకోవడానికి అర్జున్ బృందం రంగంలోకి దిగుతుంది.
ఈ సై-కో కిల్లర్‌ని ట్రాప్ చేసే సమయంలో అనుకోకుండా అర్జున్ ఫ్రెండ్ ఆండ్రూ చనిపోతాడు. ఆ బాధతో అర్జున్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకుంటాడు. అయితే జైల్లో ఉన్న బ్రహ్మ తప్పించుకోవడంతో స్టోరీ తిరిగి మళ్ళీ మొదటికి వస్తుంది. మళ్లీ సిటీలో హత్యలు మొదలవుతాయి కానీ అవి అన్ని అర్జున్‌కి సన్నిహితులే కావడం విశేషం. బ్రహ్మ అర్జున్ సన్నిహితులను ఎందుకు టార్గెట్ చేశాడు? అర్జున్ తిరిగి బ్రహ్మను ఆపడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశాడు? లాస్ట్ కి ఏమైంది ?తెలుసుకోవాలి అంటే స్టోరీ చూడాల్సిందే.
విశ్లేషణ:
Ads
నగరంలో వరుస హ-త్య-లు చేసే ఒక సై-కో కి-ల్ల-ర్.. అతన్ని ఆపాలి అనుకునే పోలీస్ ఆఫీసర్ ..ఆ క్రమంలో స్నేహితుడిని పోగొట్టుకుని ఒక ఎమోషనల్ సన్నివేశం.. ఇలా కథ ఎంతో ఆసక్తిగా సాగుతుంది. మామూలు సై-కో కి-ల్ల-ర్ మూవీ లాగానే ఉన్నప్పటికీ కథనంలో కాస్త కొత్తదనం ఉంది. మరి ముఖ్యంగా నేరం జరిగే తీరు ..దాని చుట్టూ సన్నివేశాల అల్లిక.. ఒకపక్క విలన్ ఇంకో పక్క హీరో ఇద్దరి మైండ్ గేమ్.. కాస్త వినూత్నంగా అనిపిస్తేనే ఇటువంటి సైకో థ్రిల్లర్ చిత్రాలు బాగా క్లిక్ అవుతాయి. ఇందులో నేరం జరిగిన పద్ధతి ,చుట్టూ పరిస్థితులు బాగా చూపించినప్పటికీ మైండ్ గేమ్ దగ్గర కాస్త డిఫెక్ట్ కనిపిస్తుంది.
అర్జున్ ఇంట్రడక్షన్ నుంచి సై-కో కి-ల్లిం-గ్ స్టార్ట్ అవడం వరకు అంతా హడావిడిగా మొదటి 10 నిమిషాల్లో చక చకా చూపించాడు డైరెక్టర్. అయితే ఆ తర్వాత స్టోరీ పూర్తిగా స్లో మోషన్ లో సాగుతుంది. సై-కో హ-త్య-లు ఎలా చేస్తాడు అనేదాన్ని మరి ఎక్కువ డీటెయిల్ గా చూపించడానికి డైరెక్టర్ ప్రయత్నించడంతో కాస్త విసుగు కలుగుతుంది. పోలీసులు ఎక్కువ కష్టపడకుండా అన్ని హ-త్య-లు చేసిన సై-కో కి-ల్ల-ర్ అమాంతం దొరకడం కాస్త లాజిక్ కు విరుద్ధంగా ఉంది.
ఇంటర్వెల్ కి ముందు సైకో వెనక ఇంకో సై-కో ఉన్నాడు అని తెలియడంతో స్టోరీ పై కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది.ద్వితీయార్ధం కూడా సైకో కిల్లర్ చేసే సీరియల్ హత్యలతో…హీరో మధ్య సంఘర్షణ సాగుతుంది.జైల్లో ఉన్న కి-ల్ల-ర్ తనలాంటి ఇంకో సై-కో-ని తయారు చేసిన విధానం ఆసక్తిరేకెత్తిస్తుంది. కానీ సై-కో తన స్టోరీని తానే స్వయంగా చెప్పడం , చూసి చూడగానే జరుగుతున్నది ఏదో హీరో కనిపెట్టడం.. కాస్త విడురంగా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్:
- జయం రవి యాక్టింగ్
- ఇంటర్వల్ ముందు ట్విస్ట్
- సెకండ్ హాఫ్ లో సన్నివేశాలు
మైనస్ పాయింట్స్:
- మరి సాగదీతగా ఉన్న కథ
- అక్కడక్కడ మిస్ అయిన లాజిక్
- కాస్త గందరగోళంగా సాగే స్క్రీన్ ప్లే
రేటింగ్:
2 /5
చివరి మాట:
లాజిక్ పక్కన పెడితే ఇది మాంచి థ్రిల్లర్ మూవీ అనడంలో ఎటువంటి డౌట్ లేదు.
watch trailer :