Ads
పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయని పెద్దలు అంటారు. పెళ్లి అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అందువల్లే వివాహ వేడుకను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అత్యంత వైభవంగా, జీవితాంతం గుర్తుండే మధుర జ్ఞాపకంలా మలుచుకుంటారు.
పెళ్లి చేసుకున్న తరువాత జీవితాంతం ఒకరికొకరు తోడుగా ఉండాలని అని ప్రతి జంట కోరుకుంటుంది. కానీ, పెళ్లి చేసుకున్న జంటలన్నీ అలా ఉండవు. కొన్ని అభిప్రాయ బేధాలతో విడిపోతే, కొందరు శాశ్వతంగా దూరం అవుతారు. అలా ఇద్దరు పిల్లలు ఉన్న అక్క మరణించడంతో ఒక యువతి గొప్ప త్యాగం చేసింది. అదేమిటో ఇప్పుడు చూద్దాం..
కుంచనపల్లికి చెందిన ఒక వివాహిత కరోనాసెకండ్ వేవ్ సమయంలో కన్నుమూసింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఆమె చనిపోయిన దగ్గర నుండి తల్లి లేని బిడ్డలను చూసుకుంటూ భార్య పోయిన బాధను అనుభవిస్తూ పలు ఇబ్బందులు పడుతున్నాడు. తల్లి గురించి పిల్లలు అడిగిన ప్రశ్నలకు, అతను మరింత బాధ పడుతూ ఉండేవాడు. అక్క పిల్లలను చూసిన బాధపడిన ఆ వివాహిత చెల్లి వారి కోసం ఒక నిర్ణయాన్ని తీసుకుంది.
వారికి ఆమె తల్లిగా మారి, అక్కపిలల్లకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇక అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. కానీ వారు అందుకు అంగీకరించలేదు. ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఆ యువతి, అక్క భర్తను మాత్రమే పెళ్లి చేసుకుంటాను వేరే ఎవరిని చేసుకొనని, సీరియస్ గా చెప్పింది. అక్కభర్తకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పగా, అతడు వద్దని చెప్పాడు. అయినా ఆ యువతి తన అక్క పిల్లల బాధ్యత తనదే అని చెప్పింది.
అయితే ఆమె తల్లిదండ్రులు అలా చేయవద్దని కోప్పడ్డారు, పలు రకాలుగా బెదిరించారు. ఆమె వినకపోవడంతో ఆస్తి రాసిచ్చి, ఇష్టం వచ్చినట్టుగా ఉండమని చెప్పారు. దాంతో ఆమె ఆస్తి రాసిచ్చి, పోలీస్ స్టేషన్ లో అక్క భర్తను వివాహం చేసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యువతి వివరాలను తెలిపింది. ఈ విషయం తెలిసినవారు ఆమె చేసిన పనికి అభినందిస్తున్నారు.
Ads
Also Read: పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ వివాహం చేసుకున్న వారే ఎక్కువగా విడిపోతున్నారా.? కారణం ఇదేనా.?