Ads
వన్ డే వరల్డ్ కప్ లో టీం ఇండియా వరస విజయాలతో దూసుకుపోతుంది. శనివారం చిరకాల ప్రత్యర్థి అయిన పాక్ ను ఓడించి పాయింట్స్ టేబుల్ లో ఒకటవ స్థానంలోకి చేరింది. మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి టోర్నీలో బోణి కొట్టిన తర్వాత రెండో మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ పై సులభంగా విజయం సాధించింది భారత్. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉంది భారత్. బౌలింగ్, బాటింగ్, ఫీల్డింగ్..ఇలా అన్నిటిలో బలంగా కనిపిస్తుంది టీం ఇండియా.
అయితే టీం ఇండియాకి నెక్స్ట్ పెద్ద సవాలు రానుంది. ఎప్పటిలాగే సెమి ఫైనల్స్ లో న్యూజిలాండ్ లేదా ఇంగ్లాండ్ రూపంలో కాదండోయ్. లీగ్ మ్యాచ్ లోనే బంగ్లాదేశ్ జట్టుతో. బంగ్లాదేశ్ లాంటి చిన్న టీం తో ఇండియాకి సమస్య ఏంటి అనుకుంటున్నారా. ఆసియా కప్ లో ఈ ఒక్క టీం తోనే ఇండియా ఓడిపోయింది. గత కొద్ది కాలంగా బంగ్లాదేశ్ జట్టు నిలకడైన ప్రదర్శన కనబరుస్తుంది.
Ads
2017లో వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గెలుపు ఎంతో కష్టంగా నమోదు అయింది.2022లో బంగ్లాదేశ్ లో భారత్ పర్యటించినప్పుడు వన్డే సిరీస్ చేయి జారిపోయింది. 2022 టి20 ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో కూడా వెంట్రుక వాసి తేడాతో బంగ్లాదేశ్ పై అతి కష్టం మీద టీమిండియా గెలవగలిగింది. ఆసియా కప్ 2023లో కూడా టీమిండియా బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.
అందుకే ప్రస్తుతం జరగబోయే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు వల్ల భారత్ కు పెను ప్రమాదమే పొంచి ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. బలమైన జట్లను అలవోకగా గెలుస్తున్న భారత్.. బంగ్లాదేశ్ చేతిలో మాత్రం ఊహించని విధంగా ఓడిపోతూ వస్తుంది. ఈ గురువారం పుణే వేదికగా ఇండియా బంగ్లాదేశ్ తో తలపడనుంది. మనోళ్లు విజయ యాత్రను కొనసాగిస్తారా లేక బంగ్లాదేశ్ మన గెలుపుకి బ్రేక్ వేస్తుందా అనేది చూడాలి.