Ads
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. చిన్నారుల దగ్గర నుండి వయో వృద్ధుల వరకు, అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం జగన్ పలు సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల పై తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఇప్పుడు తమిళనాడు ప్రజలు కూడా చేరారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..
ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల్లో చేసిన సర్వే రిపోర్ట్‌లో తమిళనాడు ప్రజలు ఏపీలోని సంక్షేమ పథకాల అమలును చూసి, ముఖ్యమంత్రిగా మాకు ఒక జగన్ కావాలని చెబుతున్నారు. ఏపీ సరిహద్దు గ్రామం మిట్టపాళెం, తమిళనాడు సరిహద్దు గ్రామం పున్నియం రెండు పక్కపక్కనే ఉన్నాయి. ఏపీలోని మిట్టపాళెంలోని గ్రామ సచివాలయంలో పింఛన్లు, ఆరోగ్య సేవలు, చదువులు వంటి అనేక సేవలు ఒకే చోట అందుబాటులో ఉన్నాయి. గ్రామంలో ప్రభత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రంలు అందుబాటులో ఉన్నాయి.
ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలన్ని ప్రజల దగ్గరకే వస్తున్నాయి. బర్త్, క్యాస్ట్, ఆదాయ సర్టిఫికెట్లు, మ్యుటేషన్ వంటి పౌర సేవలను ఎలాంటి ఖర్చు లేకుండా, గ్రామం దాటకుండానే మిట్టపాళెం ప్రజలు పొందగలుగుతున్నారు. పక్కనే ఉన్న గ్రామం కావడంతో పున్నియం గ్రామ ప్రజలకు మిట్టపాళెం గ్రామస్థులకు అందుతున్న సంక్షేమ పథకాలు, పౌరసేవలను చూసిన తమిళనాడు ప్రజలకు తమకు కూడా జగన్ లాంటి సీఎం ఉంటే బాగుండని అనుకుంటున్నారు.
ఏపీ ప్రభత్వ పథకాలను వారి రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుటుంది అని తమిళ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పథకాలను చూసిన కొందరు ఆంధ్రప్రదేశ్ స్థానికత పొందాలని అనిపిస్తుందని అంటున్నారు. కొందరు వారి పిల్లలకు ఏపీ పెళ్లి సంబంధాలు చూడాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. తమిళ ప్రజలు జగన్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారు.
Ads
watch video:
article sourced from sakshi tv
Also Read: కోర్టులో హై డ్రామా… జడ్జ్ ఆగ్రహం..? ఏం జరిగిందంటే..?