Ads
ఈ రోజు మనం చూస్తున్న ఎంతోమంది హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు అప్పట్లో డైరెక్టర్ల, ప్రొడ్యూసర్ల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బౌన్సర్లతో గెంటేయించుకున్న వాళ్లే.. ఇదే విషయాన్ని ఆర్ ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ వెల్లడించాడు. గతంలో ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా కార్తికేయ అలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. అలీ ఈ విషయాన్ని ప్రస్తావించగా కార్తికేయ జరిగింది చెప్పుకొచ్చాడు.
ఓ రోజు పూరీ జగన్నాథ్ తో ఫోటో దిగగా పూరీ కార్తికేయను ఆఫీస్ కి వచ్చి కలవమన్నాడంటా.. అలా అని కార్తికేయ ఆఫీస్ కు వెళ్తే.. అక్కడ ఉన్న వాచ్ మెన్ లాగేశాడంటా, సరే అని పూరీ డైరెక్ట్ చేస్తున్న జ్యోతిలక్ష్మీ షూటింగ్ కి వెళ్తే అక్కడ కూడా బౌన్సర్లు లాగేసారంటా.. చివరకు అక్కడ పూరీ కార్తికేయను చూసినా గుర్తుపట్టలేదంటా, కానీ పూరీని కలవాలన్నా కార్తికేయ తపనను చూసి పిలిచి మాట్లాడి అసిస్టెంట్ డైరెక్టర్స్ కి నీ నంబర్ ఇచ్చి వెళ్లు ఏదైనా ఉంటే చెప్తారు అన్నాడంటా..
Ads
కట్ చేస్తే.. ఇప్పుడు కార్తికేయ హీరో . . ఎప్పటికైనా పూరితో సినిమా చేయాలని తన కోరిక అని తన మనసులోని మాట చెప్పాడు కార్తికేయ. కార్తికేయ కేవలం హీరోగానే కాకుండా, గ్యాంగ్ లీడర్, వలీమై వంటి సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. కార్తికేయ అలీతో మాట్లాడిన వీడియో కింద ఇవ్వబడింది.
watch video:
తాజాగా కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన “బెదురులంక” సినిమా ఒటిటిలో విడుదలయ్యి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుంది.