టాలీవుడ్ లో ఆ స్టార్‌ హీరో సినిమాలో అవకాశం వస్తే నటిస్తా అంటూ రోజా కామెంట్స్..!

Ads

సినీ నటి, ఏపీ మినిస్టర్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చాలా ఏళ్ల పాటు రాణించిన రోజా, వివాహం తరువాత కొన్నేళ్ళు సినిమాలకు దూరం అయ్యారు. ఆ తరువాత సినిమాలలో నటిస్తూ, బుల్లితెర పై జబర్దస్త్ జడ్జిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ పొందిన రోజా, మంత్రి అయిన తరువాత సినిమాలకు, బుల్లితెరకు వీడ్కోలు ప్రకటించారు. తాజాగా రోజా సీరియల్ నటి రెస్టారెంట్ ఓపెనింగ్ కు హాజరయ్యారు. అక్కడ మీడియాతో మాట్లాడిన రోజా ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే, నటిస్తానని చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సీరియల్ నటి శ్రీవాణి పలు సీరియల్స్‌లలో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె నటించిన పలు సీరియల్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి. కొంతకాలంగా సీరియల్స్‌కు దూరంగా ఉంటున్న శ్రీవాణి, తన ఫ్యాన్స్ కోసం యూట్యూబ్‌ ఛానల్‌తో మొదలుపెట్టింది. ఆ ఛానెల్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటుంది. శ్రీవాణి భర్త విక్రమాదిత్య కూడా యాక్టర్. వీరిద్దరూ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లో అడుగుపెట్టారు.

Ads

విక్రమాదిత్య ‘మీ కడుపునిండా, తెలుగువారి రుచులు’ అనే రెస్టారెంట్ ను సందీప్ మిరియాలతో కలిసి మణికొండలో మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ఏపీ మినిస్టర్ రోజా రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ బిజినెస్ లో రాణించాలని రోజా శ్రీవాణి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన రోజా తనకు నచ్చిన వంటకాలు గురించి, డైట్ ప్లాన్ గురించి తెలిపారు. తనకు నాన్ వెజ్ వంటకాలంటే చాలా ఇష్టమని తెలిపారు. వాటిలో రొయ్యల ఇగురు చేపల పులుసును ఎక్కువగా ఇష్టపడుతానని అన్నారు.
సినిమాల గురించి అడుగగా, ఎన్నో ఏళ్ల నుండి సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేశ్‌ బాబు సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని రోజా తెలిపారు. అయితే తల్లి క్యారెక్టర్ ను మాత్రం చేయనని, అక్క లేదా వదిన వంటి క్యారెక్టర్ అయితే సంతోషంగా నటిస్తానని రోజా వెల్లడించారు.

Also Read: మెగా ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలో ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..? వాస్తవాలు తెలియకుండా ఎందుకు ఇలా రాస్తున్నారు.?

Previous articleపెళ్లి కార్డుకి అన్ని లక్షలా..? మన మిడిల్ క్లాస్ లో ఆ ఖర్చులో పెళ్లి చేసేయచ్చు.!
Next articleయాత్ర 2 లో చంద్రబాబు పాత్రను పోషిస్తున్న నటుడు ఎవరో తెలుసా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.