Ads
ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయిన రేణు దేశాయ్ కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే రేణు దేశాయ్, పెళ్లి చేసుకుని, నటనకు దూరం అయ్యారు.
రేణు దేశాయ్ దాదాపు 20 ఏళ్ల తరువాత ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో నటించింది. ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించారు. ఈ మూవీ త్వరలోనే ఆడియెన్స్ ముందుకి రానుంది. తాజాగా రేణు దేశాయ్ గురించిన ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రేణుదేశాయ్ మహారాష్ట్రలోని పూణెలో 1981లో డిసెంబర్ 4న గుజరాతీ ఫ్యామిలిలో జన్మించారు. ఆమె మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టారు. శంకర్ మహదేవన్ యొక్క “బ్రీత్లెస్” సాంగ్ వీడియోలో కనిపించారు. 2000లో పార్థిబన్ హీరోగా నటించిన కోలీవుడ్ సినిమా జేమ్స్ పాండు మూవీతో రేణుదేశాయ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అదే ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బద్రి’ మూవీలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా నటించింది. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది.
2009 లో పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ పెళ్లి చేసుకున్నారు, ఈ జంటకి ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆద్య ఉన్నారు. 2012 లో వీరు విడాకులు తీసుకున్నారు. 2003 లో జానీ మూవీలో నటించిన తరువాత రేణుదేశాయ్ సినిమాలలో నటించలేదు. దాదాపు 20 ఏళ్ల తరువాత టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హేమలత లవణం అనే పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన టైగర్ నాగేశ్వరరావు ప్రీరిలీజ్ ఈవెంట్ లో రేణుదేశాయ్ పాల్గొన్నారు.
ఇది ఇలా ఉంటే, తాజాగా రేణుదేశాయ్ మహేష్ బాబు కాంబోలో సినిమా మిస్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా ఎంత ప్రత్యేకం అనేది అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా మొదట రేణుదేశాయ్ అనుకుని, దర్శకుడు కృష్ణవంశీ ఆమెను సంప్రదించారట. అయితే అప్పటికే రేణుదేశాయ్ సినిమాలలో నటించకూడదని డిసైడ్ చేసుకుంది. దాంతో ఆమెకు పాత్ర నచ్చినా, చేయలేనని చెప్పిందంట. ఆ తరువాత సోనాలి బింద్రేని హీరోయిన్ గా తీసుకున్నారట.
Ads
Also Read: ఈ సినిమా గురించి తెలిసే జాతీయ అవార్డు ఇచ్చారా.? అది కూడా అంత మంచి సినిమాను పక్కన పెట్టి.!