Ads
నందమూరి బాలకృష్ణ మోస్ట్ అవైటెడ్ మూవీ భగవంత్ కేసరి ఎట్టకేలకు ఈరోజు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా కానుకగా బరిలోకి దిగిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సునామీ సృష్టించిందో ఓ లుక్కేద్దాం పదండి..
- మూవీ : భగవంత్ కేసరి
- దర్శకత్వం: అనిల్ రావిపూడి
- నిర్మాత : సాహు గారపాటి,హరీష్ పెద్ది
- తారాగణం: నందమూరి బాలకృష్ణ,కాజల్ అగర్వాల్,అర్జున్ రాంపాల్,శ్రీలీల, శరత్ కుమార్
- ఛాయాగ్రహణం :రామ్ ప్రసాద్
- సంగీతం :ఎస్.ఎస్. థమన్
- నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
- విడుదల తేదీ :2023 అక్టోబరు 19
కథ:
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక ఆదర్శవంతమైన వ్యక్తి భగవంత్ కేసరి. అతను ఖైదీగా ఉన్న టైంలో అక్కడ జైలర్ కూతురు విజ్జి అతను సంరక్షకుడిగా మారుతాడు. మరోపక్క సంఘ్వీ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త.. దేశంలోనే నెంబర్ వన్ కావాలి అని ప్రయత్నిస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతనికి డిప్యూటీ సీఎం కి మధ్య జరిగే గొడవలో విజ్జీ తెలియకుండానే ఇరుక్కుంటుంది.
అసలు విజ్జికి భగవంత్ మధ్య అనుబంధం ఏమిటి? చివరకు విజ్జిని భగవంత్ ఎలా కాపాడతాడు?? సంఘ్వీ కు డిప్యూటీ సీఎం కి మధ్య గొడవ ఏమిటి? ఇందులో కాజోల్ పాత్ర ఏమిటి? తెలుసుకోవాలి అంటే తెరపై చిత్రాన్ని చూడాల్సిందే.
విశ్లేషణ:
ఈ చిత్రంలో బాలకృష్ణ తన వయసుకు తగిన పాత్రలో కనిపించాడు. తన జీవితాన్ని మలుపు తిప్పిన జైలర్ కూతురి సంరక్షకుడిగా అతని తపన ఎమోషనల్ గా ప్రేక్షకులను చాలా మెప్పిస్తుంది. ఇక విజ్జి పాత్రలో శ్రీ లీల నటన కూడా ఎంతో అద్భుతంగా ఉంది.
ఎలాగైనా తన కూతర్ని మిలిటరీ అధికారిగా చూడాలి అన్న భగవంత్ కేసరి చేసే ప్రయత్నం, తండ్రి కూతుర్ల మధ్య ఎమోషనల్ అటాచ్మెంట్.. ఇలా ప్రతి ఒక్కటి ఎంతో పర్ఫెక్ట్ గా రూపొందించడం జరిగింది. కాజల్ కు ఈ చిత్రంలో చాలా క్లుప్తమైన పాత ఇచ్చినప్పటికీ ఆమె తన మేర అద్భుతంగా నటించింది. విలన్ గా అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Ads
జనాల్లో ఒక మామూలు వ్యక్తిగా బతుకుతున్న హీరో, అతను పెంచుకుంటున్న ఒక కూతురు, వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం. సజావుగా సాగుతున్న వాళ్ల జీవితంలోకి విలన్ ఎంట్రీ కారణంగా ప్రమాదంలో పడ్డ హీరో కూతురు. అప్పటివరకు ఎంతో మామూలుగా ఉన్న హీరోకి భయంకరమైన ఒక ఫ్లాష్ బ్యాక్. తన కూతుర్ని కాపాడడం కోసం ఇంకొకటి వేళ్లతో పెకలించే హీరో. దాదాపు టాలీవుడ్ లో వచ్చిన 40 శాతం సినిమాల కాన్సెప్ట్ ఇదే ఉంటుంది. కానీ ఇందులో చూపించిన విధానం, క్యారెక్టర్జేషన్ మరీ ముఖ్యంగా హీరో బాలయ్య కావడం ఈ మూవీకి మంచి డిఫరెన్స్ ని తెచ్చాయి.
పైగా నిన్న మొన్న వచ్చిన వీర సింహారెడ్డి మూవీ వరకు కూడా తన ఏజ్ కి తగ్గ పాత్రలు కాసేపు పోషించినా ,మిగిలిన టైం లో సెకండ్ హీరోగా బాలయ్య కుర్ర హీరోయిన్లతో స్టెప్పులు వేశాడు. కానీ ఈసారి మాత్రం దానికి పూర్తి భిన్నంగా తన వయసుకు తగిన ఒక మెచ్యూర్డ్ పాత్రలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. తండ్రి కూతుర్ల ఎమోషన్ దగ్గర నుంచి ఈ మూవీలో ప్రతి ఒక్కసాన్నివేశం ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించడం జరిగింది అన్న విషయం సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్:
- బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్.
- కొన్ని సందర్భాల్లో బాలకృష్ణ చెప్పే మాస్ డైలాగ్స్ వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ ఇస్తాయి.
- ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కు పోటీగా నటించింది.
- కథ పాతది అయినా కాన్సెప్ట్ కొత్తగా చూపించడంలో డైరెక్టర్ క్లిక్ అయ్యాడు.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి సెట్ అయ్యే విధంగా.
మైనస్ పాయింట్స్:
- స్టోరీ కాస్త రొటీన్ గా అనిపిస్తుంది.
- ఫస్ట్ హాఫ్ లో అనవసరంగా కొన్ని సీన్లు సాగదీశారు దానివల్ల అక్కడక్కడా బోర్ కొడుతుంది.
- అనవసరమైన లవ్ ట్రాక్ మూవీ ని కాస్త సైడ్ లైన్ చేస్తుంది.
- కామెడీ సీన్స్ కొన్ని అనవసరమైన సందర్భాలలో ఇరికించినట్లుగా ఉంటుంది.
రేటింగ్ :
3 / 5
చివరి మాట:
బాలయ్య సినిమాలు ఇష్టమైన వాళ్ళకి ఈ మూవీ ఒక పెద్ద ఫీస్ట్. ఇక మాస్ డైలాగ్స్ ,ఫైట్ సీన్స్, ఎమోషన్స్.. అన్ని కలిపి వండి వడ్డించిన ఒక బ్రహ్మాండమైన విందు భోజనం భగవంత్ కేసరి. కాన్సెప్ట్ పాతదైనా సరే బాలయ్య ఉన్నాడు కాబట్టి బోర్ కొట్టదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి ఫ్యామిలీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ భగవంత్ కేసరి
watch trailer :