Ads
కరెంట్ బిల్ వస్తుందంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయ్యే రోజులు ఇవి. అలాంటిది ఒక నెల కరెంట్ బిల్ కేవలం ఐదు రూపాయలు అంటే వినడానికే షాకింగ్ గా ఉంది కదా. ఇది నిజమేనండోయ్.. అయితే ఇప్పటిది కాదు 1940 నాటి కాలం బిల్ అది. అప్పటి బిల్ పిక్ ఇప్పుడు వైరల్ కావడంతో ప్రస్తుత రేట్లు నేటిజనులు పాత కరెంటు రేట్లతో పోల్చడం మొదలు పెట్టేసారు.
సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది ఎప్పటివో పాత ,పాత బిల్స్ పోస్టుల రూపంలో వైరల్ చేయడం బాగా కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో 1940 నాటి ఒక విద్యుత్ బిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పైగా ఒక నెల పూర్తిగా విద్యుత్ని ఉపయోగించిన తర్వాత బిల్లు మొత్తం ఎంతో తెలుసా కేవలం ఐదు రూపాయలు. ఇది చూసి కొందరు నెటిజెన్స్ తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కొంతమంది అప్పుడు ఐదు రూపాయలు అంటే ఇప్పుడు ఎంత తో సమానమో తెలుసా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.
Ads
వైరల్ అవుతున్న ఈ బిల్ అక్టోబర్ నెల 1940 నాటిది. ఇది బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రామ్‌వే CO. లిమిటెడ్ అనే ప్రభుత్వ సంస్థకు చెందిన అక్టోబర్ నెల బిల్. ఈ బిల్ లెక్కల ప్రకారం 3 రూపాయల 10 పైసలు కరెంటు ఖర్చయింది మొత్తం పన్నులు కలుపుకొని బిల్ 5 రూపాయల 2 పైసలకి వచ్చింది అని స్పష్టంగా అర్థం అవుతుంది. ఈ ఫోటోని పట్టి అప్పట్లో బిల్ చేత్తో రాస్తారు అనే విషయం కూడా స్పష్టం అవుతుంది. తమాషా చూశారా అప్పుడు ఒక నెల బిల్ 5 రూపాయలు అయితే ఇప్పుడు ఒక యూనిట్ ధర 5 రూపాయలు అయిపోయింది. దీని గురించి మీరేం ఆలోచిస్తున్నారు..