1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!

Ads

నందమూరి బాలకృష్ణ లేటస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఆడియెన్స్ లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను, నందమూరి అభిమానులను ఆకట్టుకుంటోంది. రివ్యూలు సైతం పాజిటివ్ గా ఉండడంతో బాలయ్య ఖాతాలో మరో హిట్ పక్కా అని ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. అయితే ఈ మూవీలోని ఒక సీన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ట్రెండీ దర్శకుడు అనిల్ రావిపూడితో బాలకృష్ణ హీరో అనగానే, బాలయ్యను ఎలా చూపించబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలోనూ కలిగింది. అనిల్‌ రావిపూడి సినిమాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. భగవంత్ కేసరి మూవీని తన స్టైల్ కు డిఫరెంట్ గా, బాలకృష్ణను నెవర్ బిఫోర్ అన్నట్టుగా చూపించనున్నట్లు రిలీజ్ కు ముందు నుండే చెప్తూ వస్తున్నాడు. ఈ మూవీ నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. దాంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.
తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీలో బాలయ్య తన ఏజ్ కు తగ్గ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకున్నాడు.  మాస్, నటన, డైలాగ్స్ వంటి విషయాలలో కుటుంబ ప్రేక్షకులకు సైతం ఆకట్టుకున్నాడు. అనిల్ రావిపూడి చెప్పినట్టుగానే బాలకృష్ణను కొత్తగా చూపించారనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ బ్లాక్స్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందని తెలుస్తోంది. బాలయ్య కేసీపీడీ సీక్వెన్స్ అని అభిమానులు సోషల్ మీడియాలో  షేర్ చేసుకుంటున్నారు.

Ads

కానీ ఈ మూవీలోని ఒక సన్నివేశంను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో బాలకృష్ణ లారీని గాల్లో లేపే సన్నివేశం ఉంటుంది. ఇక ఈ సీన్ చూసిన నెటిజెన్లు, ఆ సీన్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, ఇంకా, 90ల సినిమాలలాగా స్టంట్స్ చేస్తే ఎలా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటివి చూసే కదా పక్క ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు సినిమాలను ట్రోల్ చేస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: TIGER NAGESWARA RAO REVIEW: “టైగర్ నాగేశ్వరరావు” సినిమా ఎలా ఉంది అంటే.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Previous articleTIGER NAGESWARA RAO REVIEW: “టైగర్ నాగేశ్వరరావు” సినిమా ఎలా ఉంది అంటే.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleసౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళా.. ఎంట్రన్స్ ఏమో అలా.. ఆమని షాకింగ్ కామెంట్స్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.