Ads
సాధారణంగా గవర్నమెంట్ కార్యాలయాల్లో తమ బాధను పట్టించుకునేవారు ఉండరు అని చాలామంది ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరుగుతూనే ఉంటుంది. అయితే దివ్యాంగుల విషయంలో అయినా జాలి జాలి చూపిస్తారేమో అని అనుకుంటాము. అయితే అలా ఆశించి వెళ్ళిన ఒక దివ్యాంగురాలుకు నిరాశే ఎదురయ్యింది.
ఆమెకు ఎదురైన ఈ చెడు అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్‌గా మారి, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి వరకు చేరింది. దాంతో ఆయన సదరు మహిళకు క్షమాపణలు చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
విరాలి మోదీ ముంబైకి చెందిన వికలాంగ హక్కుల కార్యకర్త మరియు మోటివేషనల్ స్పీకర్. అది మాత్రమే కాకుండా భారతదేశపు మొట్టమొదటి వీల్‌చైర్ మోడల్. 2014లో విరాలి మిస్ వీల్ చైర్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. విరాలి మోదీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమెకు ఎదురైన పరిస్థితిని గురించి ఎక్స్ వేదికగా వివరించింది.
“తాను అక్టోబర్ 16న ముంబైలోని ఖార్‌లోని రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహం చేసుకోవడానికి వెళ్లానని, అయితే ఆ ఆఫీస్ వికలాంగులకు అందుబాటులో ఆఫీస్ రెండవ అంతస్తులో ఉందని విరాలి వెల్లడించారు. అక్కడ లిఫ్ట్ కూడా అందుబాటులో లేదు. అక్కడి మెట్లు నిటారుగా ఉండటమే కాకుండా బాగా తుప్పు పట్టి ఉన్నాయని ఎక్కాలంటే భయం కలిగిందని అన్నారు. రిజిస్టర్ కార్యాలయంలో అపాయింట్‌మెంట్ తీసుకోక ముందే తన సమస్యను వారికి వివరించానని, కానీ తనకు సహయం చేసేందుకు ఆ రోజు ఎవరూ రాలేదు.
కనీసం తన సంతకాలు తీసుకునేందుకు కిందకు రమ్మని పిలిచినా ఆఫీస్ సిబ్బంది రాలేదు. ఆఖరికి చక్రాల కుర్చితో సహా తనను రెండవ అంతస్తుకు మోసుకెళ్లాల్సి వచ్చిందని, రెండు అంతస్తుల పైకి తీసుకెళ్లడానికి నేను వస్తువును కాదు. నేను మనిషిని, నా హక్కులు ఉన్నాయని తెలిపారు. దేశం తన అవసరాలు మరియు ఇతర వికలాంగ పౌరుల అవసరాలను తప్పక కల్పించాలని” రాసుకొచ్చారు. ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చివరికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దృష్టికి వెళ్ళింది. ఆమెకు క్షమపణలు చెప్పడమే కాకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Ads
PLEASE RT!
I am disabled and I got married at the Registrars Office at Khar Mumbai on 16/10/23. The office was on the 2nd floor WITHOUT a lift. They wouldn’t come downstairs for the signatures and I had to be carried up two flights of stairs to get married. pic.twitter.com/ZNCQF3gJRY
— Virali Modi (@Virali01) October 18, 2023
Also Read: పెళ్లి కోసం ఇతను వేసిన పోస్టర్ చూస్తే నవ్వాపుకోలేరు..? ఇంతకీ అందులో ఏం ఉందంటే..?