Ads
ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీ రోజు రోజుకి ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఊహించని రీతిలో చిన్న టీమ్స్ సంచలనాలు సృష్టిస్తుండగా, పెద్ద జట్లు అనూహ్యంగా పరాజయం పొందుతుండడంతో ఈ టోర్నీ మరింత ఆసక్తికరంగా మారింది.
నేడు జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు, దక్షిణాఫ్రికాతో ఆడనుంది. సెమీస్ రేసులో పాక్ నిలవాలంటే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాలి. ఇక ఈ మ్యాచ్ లో పాక్ గెలవాలంటే మిస్టరీ స్పిన్నర్ ను తీసుకోవాలని క్రికెట్ టెక్నికల్ కమిటీ పాక్ కు సూచించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా, ఆ తరువాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో పరాజయం పొందడం వల్ల సెమీఫైనల్ కు వెళ్లాడాన్ని సంక్లిష్టంగా మార్చుకుంది. చెన్నైలో ఆప్ఘానిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. దీంతో పాక్ ఫ్యాన్స్ నుండి మాజీ క్రికెటర్ల వరకు పాకిస్థాన్ జట్టును తీవ్రంగా విమర్శించారు.
స్పిన్నర్లకు అనువైన చెన్నై పిచ్ పై పాక్ స్పిన్నర్లు రాణించకపోవడంతో జట్టు సెలెక్షన్ గురించి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు చెన్నైలో చిదంబరం స్టేడియం వేదికగా పాకిస్థాన్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్ రేసులో ఉండాలంటే తప్పనిసరిగా పాక్ ఈ మ్యాచ్ లో విజయం సాధించాలి. ఈ మ్యాచ్ లో విజయం కోసం స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను తీసుకోవాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. అబ్రార్‌ను పాకిస్థాన్ ప్రపంచ కప్ కి సెలెక్ట్ చేయలేదు. కానీ అతన్ని రిజర్వ్ ఆటగాళ్లలో ఒకరిగా ఇండియాకు తీసుకొచ్చింది.
Ads
“ప్రపంచ కప్ టోర్నీ ద్వైపాక్షిక సిరీస్‌లకు భిన్నమైంది. ఒక జట్టు మిగతా జట్లతో ఒక్క మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. అందువల్ల అబ్రార్‌ను ఆడించినట్లయితే ఒక్కో జట్టు పై అతను ఒక్కసారే ఆడడం జరుగుతుంది. టోర్నీలో ఉన్న చాలా మంది ప్లేయర్స్ అబ్రార్ ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. దాంతో పాక్ జట్టుకు ప్రయోజనం జరుగుతుంది” అని ఆ దేశ క్రికెట్ టెక్నికల్ కమిటీ హెడ్ మిస్బా ఉల్ హక్ అన్నారు. అసలు అబ్రార్ ను ప్రపంచ కప్ టోర్నీలో ఎందుకు ఆడించట్లేదో అర్థం కావట్లేదని మాజీ క్రికెటర్ యాసిర్ హమీద్ తెలిపారు.
Also Read: భారత్ తో మీకు పోలికా.? వెళ్లి పిల్ల కూనలపై ఆడుకోండి..!