MARTIN LUTHER KING REVIEW: సంపూర్ణేష్ బాబు నటించిన “మార్టిన్ లూథర్ కింగ్” ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

పండగ అయిపోయింది పెద్ద సినిమాలు అయిపోయాయి అనుకునే లోపు చిన్న సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఇప్పటివరకు కామెడీతో మనల్ని కడుపుబ్బ నవ్వించిన సంపూర్ణేష్ బాబు మొదటిసారి ఎమోషనల్ యాంగిల్ ని కూడా ట్రై చేస్తూ మార్టిన్ లూథర్ కింగ్ అంటూ మన ముందుకు వచ్చేసాడు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

  • మూవీ: మార్టిన్ లూథర్ కింగ్
  • తారాగణం: సంపూర్ణేష్ బాబు, వీకే నరేష్, శరణ్య ప్రదీప్, వెంకటేష్ మహా
  • దర్శకత్వం: పూజ కొల్లూరు
  • నిర్మాతలు: ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర క్రియేటివ్స్
  • సినిమాటోగ్రఫి: దీపక్ యరగెరా
  • మ్యూజిక్: స్మరణ్ సాయి
  • రిలీజ్ డేట్: 2023-10-27

Martin Luther King review

కథ:

అనగనగా పడమరపాడు అనే ఒక గ్రామంలో.. కుటుంబం, ఇల్లు ఏమీ లేని ఒక వ్యక్తి..స్మైల్(సంపూర్ణేష్ బాబు) చెప్పులు కుట్టుకుంటూ బతుకుతుంటాడు. ఆ ఊరు మొత్తానికి అతనికి బాట అనే ఒక ఫ్రెండ్ మాత్రమే తోడు. ఎక్కడ ఊర్లో వాళ్ళు వెళ్లగొడతారు అన్న భయంతో వాళ్లు చెప్పిన పనిని చేస్తూ బతుకుతుంటాడు ఈ స్మైలీ. ఎప్పటికైనా తాను సంపాదించిన డబ్బుతో ఒక చొప్పులు షాపు పెట్టుకోవాలి అని కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు ఎవరో దొంగతనం చేస్తారు.

Martin Luther King review

ఇక ఇలా దాచి పెట్టడం లాభం లేదని పోస్ట్ ఆఫీస్ లో భద్రపరుచుకోమని అతని ఫ్రెండ్ బాటా ఇచ్చిన సలహా మేరకు పోస్ట్ ఆఫీస్ కి వెళ్తాడు స్మైల్. అయితే అక్కడ అతనికి ఆధార్ కార్డు లేక రేషన్ కార్డ్ అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేసే వసంత(శరణ్య ప్రదీప్) తో అతనికి పరిచయం ఏర్పడుతుంది. సొంత పేరు కూడా సరిగ్గా తెలియని స్మైలీకి వసంత మార్టిన్ లూథర్ కింగ్ అనే కొత్త పేరు పెడుతుంది.

Martin Luther King review

Ads

అయితే అదే ఊర్లో..జగ్గు(నరేష్) , లోకి(వెంకటేష్ మహా) ఇద్దరూ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడతారు. వారిని సర్వే నివేదిక ప్రకారం ఇద్దరికీ సమానమైన ఓట్లు వస్తాయి కానీ ఒకే ఒక ఓటు వారి గెలుపు ఓటమిని డిసైడ్ చేస్తుంది. ఎవరిదో కాదు మార్టిన్ లూథర్ కింగ్ దే. ఇక వీళ్ళిద్దరి కారణంగా అతని జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి? మార్టిన్ సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగిలిన కథ.

Martin Luther King review

విశ్లేషణ:

సంపూర్ణేష్ బాబు ఇంతకాలం కామెడీతో మనల్ని నవ్వించాడు కానీ ఈ చిత్రంలో ఎమోషన్ తో టచ్ చేశాడు. ఈ మూవీలో అతని ట్రాన్స్ఫార్మేషన్ నిజంగా అద్భుతంగా ఉంది. ఇక నరేష్ జగ్గు పాత్రకి ప్రాణం పోసాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మరో పక్క లోకి క్యారెక్టర్ చేసిన వెంకటేష్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంత సింపుల్గా ,చాలా నాచురల్ గా మన మధ్య జరిగే ఒక కథలాగే ఈ చిత్రాన్ని తరకెక్కించారు. మొత్తానికి చిన్న చిత్రమైన.. చెప్పాలి అనుకున్న కంటెంట్ ని స్ట్రైట్ గా బాగా కన్వే చేశారు.

Martin Luther King review

ప్లస్ పాయింట్స్:

  • సంపూర్ణేష్ బాబు ఈ మూవీలో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.
  • కథ కాన్సెప్ట్ కొత్తగా ఉండడమే కాకుండా కథనం కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
  • మూవీ ఎంతో నాచురల్ గా ఎటువంటి హడావిడి లేకుండా సాగుతుంది.

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడ ఎమోషన్స్ కాస్త ఎక్కువైనట్లు కనిపిస్తాయి.
  • సిల్లీ విషయాలను కూడా హైలెట్ చేశారు అన్న భావన కలుగుతుంది.

రేటింగ్:

2.5/5

చివరి మాట:

సంపూర్ణేష్ బాబు మార్క్ మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. మంచి కామెడీ పొలిటికల్ డ్రామా చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ చిత్రాన్ని అస్సలు మిస్ చేసుకోకండి.

watch trailer :

Previous articleఇంట్లో ఒప్పుకోకపోయినాసరే పెళ్లి చేసుకున్నారు.. కంటతడి పెట్టిస్తున్న యువతి గాధ.!
Next articleపాకిస్తాన్ గెలవాలంటే టీం లోకి అతన్ని తీసుకొని రావాల్సిందే అంట.. అయినా ఇప్పుడు లాభమేముంది..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.