Ads
పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోక తప్పదు. ఏదో ఒక రోజు మరణం వస్తుంది. అయితే మరణం ఎప్పుడు వస్తుంది..?, ఎలా వస్తుంది అనేది ఎవరు చెప్పలేము. పైగా ఈ మధ్య వయసు సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలతో చాలా మంది మరణిస్తున్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ”పుట్టిన వారు మరణించక తప్పదు”.
అయితే మన యొక్క ప్రాణాన్ని యమధర్మరాజు వేరు చేస్తారు అని మనకి తెలిసిన విషయమే. ఆయనే మన ప్రాణాలని తీసుకువెళ్లిపోతారని మనకి తెలుసు.
సినిమాల్లో కూడా మనం యమధర్మరాజు తీసుకువెళ్ళిపోవడం చూస్తూనే ఉంటాం. కానీ మన ప్రాణాలని తీసుకు వెళ్లడానికి ముందు యమధర్మరాజు కొన్ని సంకేతాలని పంపిస్తారు. మరి యమధర్మరాజు ప్రాణాలను తీసుకు వెళ్లే ముందు ఎటువంటి సంకేతాలను పంపిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఆ సంకేతాలని కథ ఒకటి ఉంది. అదే ఇది. అమృతుడు అనే ఒక అతను యమునా నదీ తీరం లో ఉండేవాడు. ఎప్పుడు కూడా అతనికి ఎపుడు చనిపోతానో అని భయం వేస్తూ ఉండేది. ఆ దిగులు పోవాలనే యమ ధర్మ రాజుని ఉద్దేశించి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. ఆ తపస్సుకి మెచ్చి యమధర్మ రాజు వరం కోరొకోమని చెప్పాడు. మరణం ఎప్పుడు వస్తుందని నాకు ముందే చెప్పాలని అడుగుతాడు. అది తెలిస్తే తన బాధ్యతలని అప్పగించేయచ్చని అనుకుంటాడు.
Ads
దానికి యమధర్మ రాజు మరణం కోసం చెప్పడం అవ్వదని… కొన్ని సంకేతాలను పంపిస్తా అని చెబుతాడు. కానీ ఈ విషయం అమృతుడు మర్చిపోతాడు. ఒక నాడు అమృతుడికి యమధర్మరాజు చెప్పినది గుర్తు వస్తుంది. కానీ ఆ సంకేతాలు రాలేదని.. ఇంకా ఆయువు ఉందని అమృతుడు భావిస్తాడు. వయస్సు పెరుగుతోంది…ఓ నాడు యమధర్మరాజు అతని ప్రాణాలు తీసుకుని వెళ్లిపోవడానికి వస్తాడు. సూచనల్ని పంపుతానని మాటిచ్చావు కదా అని అమృతుడు అడుగుతాడు. దానికి యమధర్మరాజు ఇలా సమాధానం చెప్తాడు..” వెంట్రుకలు తెల్లగా మారడం, చర్మం ముడతలు పడడం, పళ్ళు ఊడిపోవడం, పక్షవాతం రావడం” ఇవన్నీ కూడా సూచనలే అని అంటాడు యముడు. అవునని అమృతుడు అన్నాక యమధర్మరాజు అతని ప్రాణాలను తీసుకు వెళ్తాడు.