పాకిస్థాన్ పై మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు వెనకున్న ఈ భారతీయుడు ఎవరో తెలుసా..?

Ads

ప్రపంచ కప్ 2023 టోర్నీలో భాగంగా శుక్రవారం నాడు జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్‌ పై  సౌతాఫ్రికా విజయాన్ని సాధించి పాయిట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచింది.

చివరి వికెట్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పాకిస్థాన్ చివరి వరకూ గెలుపు కోసం పోరాడింది. అయితే పాకిస్థాన్‌ గెలుపుకు సౌతాఫ్రికా ప్లేయర్ కేశవ్ మహారాజ్ అడ్డుగా నిలిచాడు. దాంతో సౌతాఫ్రికా పాక్ పై గెలుపు సాధించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 270 పరుగులు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టులో , క్లాసేన్ 12, మిల్లర్ 29 ఆ తరువాత వచ్చిన  ఐడెన్‌ మార్క్రామ్ 91 పరుగులు చేసి, స్కోర్ 250 పరుగుల దగ్గర అవుట్ అయ్యాడు. వరుసగా వికెట్లు తీసిన పాక్‌ బౌలర్లు, పరుగులు పెద్దగా ఇవ్వకపోవడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. చివర్లో బ్యాటింగ్ వచ్చిన కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సీ తో కలిసి ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాకు విజయాన్ని అందించారు.

Ads

కేశవ్ 21 బంతుల్లో 7 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2009 అనంతరం టీ20, వన్డే ప్రపంచ కప్‌లలో పాకిస్థాన్‌ జట్టు పై సౌతాఫ్రికాకు ఇదే మొదటి గెలుపు. ఈ గెలుపు కారణమైన కేశవ్ మహరాజ్ భారత సంతతికి చెందిన ప్లేయర్. కేశవ్ పూర్వీకులు ఇండియా నుంచి ఉపాధి కోసం సౌతాఫ్రికాకు వలస వెళ్ళి, అక్కడే స్థిరపడ్డారు. అతని తండ్రి ఆత్మానందం క్రికెటర్. అయితే వర్ణవివక్ష వల్ల ఎదగలేకపోయాడు. కెరీర్ మొదట్లో సీమ్ బౌలర్, ఆల్‌రౌండర్ గా ఉన్న కేశవ్, ఆ తర్వాత స్పిన్నర్ గా మారాడు.
2016లో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రవేశించాడు. మొదటి మ్యాచ్‌లో స్మిత్‌ను డకౌట్‌గా చేయడంతో గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత టీ20ల్లో ఎంట్రీ ఇవ్వడంతోనే కెప్టెన్‌గా మారాడు. సౌతాఫ్రికాలోనే పుట్టి, పెరిగిన కేశవ్, హిందూ ధర్మాన్ని పాటిస్తాడు. అంజనేయుడి భక్తుడైన కేశవ్ బ్యాట్‌ మీద ఓం గుర్తు ఉంటుంది. భారతీయ మూలాలు మర్చిపోని కేశవ్ తరచూ భారత్ కు వచ్చి అంజనేయుడి దేవాలయాలను సందర్శిస్తుంటాడు. ప్రపంచ కప్ 2023 మొదలవడానికి ముందు తిరువనంతపురంలోని ఆలయాన్ని సందర్శించాడు.

Also Read: హార్దిక్ పాండ్య స్థానంలో టీం లోకి ఆ ఆల్ రౌండర్ ని తీసుకురానున్న రోహిత్…పెద్ద ప్లాన్ వేసాడుగా.?

Previous articleవెస్ట్రన్ టాయిలెట్స్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఎందుకు ఉంటాయి.? ఏది ఎప్పుడు వాడాలి.?
Next articleఈ ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు.. ముందు ఏవి చూస్తే బెటర్ అంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.