Ads
దోమలు, బొద్దింకలు ఇంట్లో తిరుగుతూ చిరాకు, అనారోగ్యాలను తెప్పిస్తూ ఉంటాయి. వాటిని ఎంత తరిమినా, ఏం చేసిన నిత్యం ఇంట్లో తిరుగుతూనే ఉంటాయి. దోమలు కుట్టడం వల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
Ads
ఇక చూడగానే చిరాకు తెప్పించే బొద్దింకలు వల్ల కూడా వ్యాధులు వ్యాపిస్తాయి. అవి ఎక్కువగా కిచెన్ లోనే తిరుగుతుంటాయి. ముఖ్యంగా సింక్ దగ్గర ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని సింక్ దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
సాయంత్రం అయ్యిందంటే దోమలు అటాక్ చేయడం ప్రారంభిస్తాయి. మెష్ డోర్స్, మస్కిటో కాయిల్స్ లాంటివి ఎన్ని వాడినా దోమలు ఇంట్లోకి రాకుండా ఉండవు. దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా లాంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. బొద్దింకలు కూడా ఇంట్లో ప్లేట్స్, గిన్నెల పై తిరుగుతూ పలు ఇన్ఫెక్షన్ల ను వ్యాపింపచేస్తాయి. సింక్ దగ్గర మరి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. కొన్ని టిప్స్ పాటించడం వల్ల వీటిని పారదోలవచ్చు.
- సమపాళ్లల్లో పుదీనా ఆకులు, నిమ్మకాయ ముక్కలు, వెనిగర్‌ను తీసుకుని ఐస్‌క్యూబ్ ట్రేలో వేసి నైట్ అంతా ఫ్రిజ్ లో పెట్టాలి. ఈ ఐస్‌క్యూబ్‌ను ఉదయం బయటకు తీసి సింక్‌లో వేయాలి. దాంతో దుర్వాసన తొలగిపోయి, బొద్దింకలు రావు.
- గ్లాసు వాటర్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను చిన్న ముక్కలుగా తుంచి వేసి, అందులో బోరిక్ యాసిడ్ 2 టీ స్పూన్లు వేసి 3 గంటల సేపు నానబెట్టాలి. తరువాత ఈ వాటర్ ని సింక్‌లో పోసినట్లయితే బొద్దింకలు రావు.
- ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడా కలిపి, ఆ తరువాత కొంచెం చక్కెర కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లో పోసి సింక్ చుట్టూ, బొద్దింకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో స్ప్రే చేయాలి. బొద్దింకలు పారిపోతాయి.
- కిచెన్ సింక్ లో ఉండే గిన్నెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అలా చేయడం వల్ల దుర్వాసన రాకుండా ఉంటుంది. నీరు నిల్వ ఉండదు కాబట్టి దోమలు, బొద్దింకలు రాకుండా ఉంటాయి.Also Read: వెస్ట్రన్ టాయిలెట్స్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఎందుకు ఉంటాయి.? ఏది ఎప్పుడు వాడాలి.?