Ads
ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. దానికి క్రియేటివిటీ తోడవడంతో మరింత పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో ఆ విషయం తెలిసిపోవడం, వైరల్ ఆవడం తెలిసిందే.
ఇటీవల కాలంలో రీల్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ చేయడం. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం ట్రెండ్ గా మారింది. దీంతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పెరుగుతున్నారు. తాజాగా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇచ్చిన వివాహ ప్రకటన వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం చాలామంది రీల్స్ చేస్తూ, రీల్సే తమ జీవితం అన్నట్టుగా బ్రతుకుతున్నారు. వాటికి వచ్చే లైకులు, ఫాలోవర్ల సంఖ్య పెరగడంతో గుర్తింపు వస్తోంది. వీటి ప్రభావం ఎంత ఉందో చెప్పడానికి వైరల్ గా మారిన ఒక వివాహ ప్రకటన చూస్తే అర్ధం అవుతుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఒక యువతి ఇచ్చిన ప్రకటన ఇది. అందులో ఆమె వరుడికి పెట్టిన కండిషన్ చూసి నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు.
వరుడి కోసం వింత యాడ్ ఇచ్చిన ఇన్ఫ్లుయెన్సర్ పేరు రియా. ఆ ప్రకటనలో తన పేరు రియా, తాను వరుడు మరియు రీల్స్ పార్టనర్ కోసం వెతుకుతున్నాను చెప్పారు. అందులో ఆమె కొన్ని కండిషన్స్ ఇచ్చింది. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కెమెరా చూసి సిగ్గుపడకూడదు. తనతో కలిసి రిలేషన్ షిప్ రీల్స్ కూడా చేయాలని, మోయి-మోయి లాంటి మ్యూజిక్‌లో రీల్స్ చేయడంలో ఎక్స్పీరియన్స్ ఉండాలని తెలిపింది. ఇవే కాకుండా ఇన్ఫ్లుయెన్సర్ రియా మరి కొన్ని షరతులు ఆ ప్రకటనలో ఇచ్చింది.
అబ్బాయి తనను సంప్రదించే ముందు అమెజాన్ మినీ టీవీలో ప్రసారం అవుతున్న హాఫ్ లవ్ అరేంజ్డ్ అనే ప్రోగ్రామ్ని తప్పనిసరిగా చూడాలని చెప్పింది. అంతేకాకుండా ఆ అబ్బాయికి ప్రీమియర్ ప్రో గురించి తెలిసి ఉండాలని, వ్లాగ్స్, రీల్స్ లను ఎడిట్ చేయగలిగేలా ఉండాలని రియా ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read: 1986లో “రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350” ధర ఎంతో తెలుసా..? వైరల్ అవుతున్న అప్పటి బిల్.!