Ads
ప్రపంచకప్ 2023 లో హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా పాకిస్థాన్ జట్టుగా వచ్చింది. ఆ టైమ్ కి వన్డేలలో టాప్ జట్టుగా ఉన్న పాక్, సెమీ ఫైనల్ వరకు వెళ్తుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా పాక్ జట్టు వరుస పరాజయాలతో విమర్శల పాలవుతోంది.
శుక్రవారం సౌత్ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ పాక్ చివరి వరకు పోరాడి, ఓటమి పాలైంది. దీంతో సెమీ ఫైనల్ కు వెళ్ళే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయితే ఈ మ్యాచ్ ఓటమి పై భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బాబర్ ఆజం కెప్టెన్సీ పై మండిపడ్డారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రపంచ కప్ 2023 లో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 27) నాడు చెన్నై చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఒడిపోవడం బాబర్ అజామ్ కెప్టెన్సీ పై చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ మరియు కామెంటేటర్ ఆకాశ్ చోప్రా దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ మ్యాచ్ రిజల్ట్స్ విశ్లేషిస్తూ, బాబర్ ఎలాంటి కెప్టెన్సీ చేస్తున్నాడు? చివరిలో, దక్షిణాఫ్రికాకు చాలా బంతులు మిగిలి ఉన్నాయి. చేయాల్సిన పరుగులు చాలా తక్కువ ఉన్నాయి.
బాబర్ సర్కిల్‌లో 4-5 ఫీల్డర్‌లను సెట్ చేశాడు. తద్వారా లోయర్ ఆర్డర్ బ్యాటర్లు సింగిల్స్ ను సులభంగా తీయడానికి వీలు కల్పించాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ విజయానికి చేరువలో ఉన్నప్పుడు బాబర్ ఆజం వారి పై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని ఆకాష్ చోప్రా ప్రశ్నించాడు. క్యాచింగ్ పట్టే అవకాశాలను సృష్టించే ప్రయత్నంలో ఫీల్డర్‌లను దగ్గరకు తీసుకురావడానికి బదులుగా, బాబర్ సెట్ చేసిన ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లు బ్యాట్స్‌మెన్ స్ట్రైక్‌ను సులభం చేశాయని అన్నారు.
ఉత్కంఠభరిత మ్యాచ్‌లో టెయిలెండర్లను సైతం కట్టడి చేయలేక పోయిన బాబర్ కెప్టెన్సీనే పాకిస్తాన్ జట్టు పరాజయనికి ముఖ్యమైన కారణమని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చెన్నై మ్యాచ్‌లో పాకిస్థాన్ పై దక్షిణాఫ్రికా ఒక్క వికెట్ తేడాతో గెలిచి వరల్డ్ కప్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక పాకిస్థాన్ జట్టు సెమీ ఫైనల్ కు చేరుకునే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Ads
Also Read: పాకిస్థాన్ పై మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు వెనకున్న ఈ భారతీయుడు ఎవరో తెలుసా..?