Ads
ప్రియాంక అరుల్ మోహన్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ మూవీతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తరువాత డాన్ మూవీతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.
ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళంలో వరుస చిత్రాలలో నటిస్తోంది. రీసెంట్ గా ‘సరిపోదా శనివారం’ మూవీ లాంచ్ ఈవెంట్ లో ప్రియాంక పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో పాల్గోన్న ప్రియాంకను నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రియాంక అరుల్ మోహన్ 2019లో కన్నడ మూవీ ఓంధ్ కథే హెల్లా మూవీ ద్వారా హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తరువాత, విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. నెలన్స్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో శివకార్తీకేయన్ హీరోగా నటించిన డాక్టర్ మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ అవడంతో ఆమెకు గుర్తింపు లభించింది.
ఆ తరువాత అదే హీరోతో డాన్ మూవీలో నటించగా, ఆ సినిమా కూడా హిట్ అవడంతో ఆమె లక్కీ హీరోయిన్ గా మారింది. దాంతో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా ధనుష్ పక్కన హీరోయిన్ గా కెప్టెన్ మిల్లర్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ఓజీ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. సరిపోదా శనివారం మూవీలో హీరో నానితో రెండో సారి నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక కొంచెం లావుగా కనిపించింది. దీంతో నెట్టింట్లో ఆమె పై నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
వీటిపై తాజాగా ప్రియాంక స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూలో, శివ కార్తికేయన్ తో రెండు సినిమాలు చేశానని, అయితే ఆయన స్వీట్లు ఎక్కువగా తింటారు. అంతే కాకుండా పక్కన ఉన్నవారికి కూడా స్వీట్స్ ఇస్తుంటారు. వద్దని చెప్పినా కూడా బలవంతంగా ఇస్తుంటారని తెలిపారు. తాను బొద్దుగా అవడానికి కారణాన్ని పరోక్షంగా చెప్పినట్టు తెలుస్తోంది. ప్రియాంక మోహన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Ads