Ads
మహిళల్లో సాధారణంగా రుతుక్రమం అనేది 28 రోజులకు ఒకసారి వస్తుందనే విషయం తెలిసిందే. అయితే కొందరిలో సడెన్ గా నెలలో రెండు సార్లు కూడా పిరియడ్ వస్తుంటుంది. అయితే ఇలా రెండు సార్లు రావడాన్ని తేలికగా తీసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత:
నెలలో 2 సార్లు రుతుక్రమం రావడానికి గా కారణాలలో ముఖ్యమైంది హార్మోన్ల అసమతుల్యత. రుతు క్రమాన్ని నియంత్రించడంలో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ హార్మోన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడడం వల్ల ఇలాంటి సమస్యలు కలుగుతాయి. పీసీఓఎస్ వంటి హార్మోనల్ డిజార్డర్ ఉన్న మహిళలలో కూడా రుతు క్రమం అస్తవ్యస్తంగా మారుతుంది.
ఒత్తిడి :
హార్మోన్ల అసమతుల్యత ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలలో ఒత్తిడి కూడా ఒకటి. ఒత్తిడికి గురికావడం వల్ల లేదా ఒత్తిడి ఎక్కువగా ఉండే పనులను చేసినపుడు దాని ప్రభావం హార్మోన్ల మీద, పిరియాడ్స్ మీద పడుతుంది. దానివల్ల పిరియాడ్స్ రెండు సార్లు వచ్చే అవకాశం ఉంది.
సంతాన నిరోధక మాత్రలు :
కొందరు మహిళలు పిల్లలు పుట్టకుండా ఉండడానికి కొన్ని మందులను ఉపయోగిస్తారు. ఆ మందులు కూడా పిరియాడ్స్ పైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటి వల్ల తీవ్ర ప్రభావం ఉంటుంది. థైరాయిడ్ సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పిరియాడ్స్ లో మార్పులు వస్తాయి. గర్భ సంచిలో ఫైబ్రాయిడ్స్ :
గర్భ సంచిలో చిన్న చిన్న గడ్డలు (ఫైబ్రాయిడ్లు) ఏర్పడినపుడు రుతుక్రమంలో మార్పులు వస్తాయి. ఫైబ్రాయిడ్లు సైజ్ ను బట్టి, అవి గర్భ సంచిలో ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని బట్టి రుతుక్రమంలో సమస్యలు తీవ్రత ఉంటుంది.
ప్రీ మెనోపాజ్:
మెనోపాజ్ వచ్చే ముందు, 40లలో ఉన్న స్త్రీలకు నెలలో 2 సార్లు రుతుక్రమం రావచ్చు. దీనిని ప్రీ మెనోపాజ్ స్టేజ్ అని అంటారు. నెలలో రెండు సార్లు పీరియాడ్స్ సమస్యను ఎదుర్కొనేవారు డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.
Also Read: రాత్రిళ్ళు “పిక్కలు” పట్టేస్తున్నాయా…? అయితే మీలో ఈ మార్పు వచ్చిందని అర్ధం.!