Ads
ఇటీవల ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి వారానికి 70 గంటల పాటు పని చేయాలంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీని పై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
నారాయణ మూర్తి వ్యాఖ్యలతో కొందరు టెక్ దిగ్గజాలు ఏకీభవించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం పై ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా కూడా స్పందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
అభివృద్ది చెందిన దేశాలతో భారత్ పోటీ పడాలంటే దేశ యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల పై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. జీతాలు ఇప్పటికే చాలా తక్కువ అని, మరింత పని భారం పెరిగితే పర్సనల్ లైఫ్ ని కూడా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుందని, ముందు చేసే పనికి తగిన జీతాలు ఇవ్వాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలతో కొందరు టెక్ దిగ్గజాలు ఏకీభవించారు. ఈ క్రమంలో ఎడిల్‌వీస్ సీఎండీ రాధికా గుప్తా సోషల్ మీడియా ఎక్స్ లో స్పందించారు. పోస్ట్ లో “ఇంటి పని, ఆఫీసు పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, పిల్లల భవిష్యత్తును సరైన క్రమంలో తీర్చిదిద్దుతూ ఎంతోమంది భారతీయ స్త్రీలు 70 గంటలకు పైగా తమ శక్తికి మించిన పనులను చేస్తున్నారు. దశాబ్దాలుగా చిరునవ్వుతో, ఎలాంటి డిమాండ్ చేయకుండా ఓవర్ టైంని, అదనపు భారాన్ని ఇప్పటికీ మోస్తూనే ఉన్నారు.
Ads
అయితే వింతగా దాన్ని ఎవరూ కూడా గుర్తించడం లేదు” అంటూ రాధికా గుప్తా రాసుకొచ్చారు. ఆమె చేసిన పోస్ట్ పై చాలామంది నెటిజెన్లు సానుకూలంగా కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్ పై బిజినెస్ ఎనలిస్ట్ లతా వెంకటేష్ రెస్పాండ్ అవుతూ, తన కొడుకు పెంపకం విషయంలో తన భర్త చాలా హెల్ప్ చేశారు. ముంబై వంటి నగరాల్లో పనికన్నా ఎక్కువ గంటల పాటు ప్రయాణించాల్సి ఉంటుందని పరోక్షంగా నారాయణ మూర్తి కామెంట్స్ కు కౌంటర్‌గా పోస్ట్ చేశారు.
Also Read: రోజుకి 14 గంటలు పని చేయాలన్న “ఇన్ఫోసిస్” అధినేత మాటలు వెనక అర్దం ఏంటి..? దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?