ఇవెక్కడి టైటిల్స్.. ఈ 7 సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి అదే కారణమా..?

Ads

ఒక సినిమా పై ఆసక్తిని కలిగించడంలో ఆ చిత్రంలో నటించే హీరోహీరోయిన్స్ తో పాటు టైటిల్స్ కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. సినిమా కథకు సెట్ అయినప్పటికీ, ఆ టైటిల్ ప్రేక్షకులకి కనెక్ట్ కాకపోతే  ఫలితం మరోలా ఉంటుంది.

ఈ మధ్యకాలంలో వచ్చిన కొన్ని చిత్రాల టైటిల్స్ ట్రెండ్ కి తగినట్టు ఉన్నా, తెలుగు నెటీవీటికి దూరంగా ఉండడం వల్ల కొన్ని చిత్రాలు, కంటెంట్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
 1. మార్టిన్ లూథర్ కింగ్: 

సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ సినిమాకి మినిమమ్ కలెక్షన్స్ కూడా దక్కడం లేదని టాక్. దీనికి కారణం తెలుగు నేటివిటీకి టైటిల్ దూరంగా ఉండడమే అని తెలుస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ అనేది ఒక విదేశీ విదేశీ నాయుకుడి పేరు.
2. సెబాస్టియన్: 

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఎస్ఆర్ కళ్యాణమండపం మూవీ హిట్ అయిన తర్వాత, సెబాస్టియన్ పిసి 524తో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.
3. పెదకాపు 1:

ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కొత్త హీరోతో పెదకాపు 1 అనే మూవీ తీశారు. టైటిల్ చూసిన చాలా మంది ఒక సామజిక వర్గానికి సంబంధించిన మూవీగా పొరబడి దూరంగా ఉన్నారు. ఈ సినిమా నిరాశపరిచింది.

Ads

4. ఛాంగురే బంగారురాజా:

మాస్ మహారాజ రవితేజ నిర్మించిన మూవీ ఛాంగురే బంగారురాజా. ఈ మూవీ క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. టైటిల్ స్టోరీకి తగ్గట్టుగా లేకపోవడంతో ఈ మూవీ ఫ్లాప్ గా నిలిచింది.
5. నెపోలియన్ :

2017 లో వచ్చిన ఈ మూవీ నెపోలియన్ అనే టైటిల్ తో ఆడియెన్స్ లో బజ్‌ని సృష్టించింది. కానీ కొత్త హీరోతో ఇలాంటి టైటిల్ తో తీయడంతో ఫ్లాప్ గా నిలిచింది.
6. స్లమ్ డాగ్ హస్బెండ్:

నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావ్ హీరోగా నటించిన కామెడీ డ్రామా స్లమ్ డాగ్ హస్బెండ్. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.
7. కృష్ణగాడు అంటే ఒక రేంజ్:

రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ జంటగా నటించిన  కృష్ణ గాడు అంటే ఒక రేంజ్ అనే మూవీ ప్రేమకథతో తెరకెక్కింది.
Also Read: ప్రియాంక మోహన్ ఇలా బొద్దుగా మారడానికి కారణం ఆ హీరో అంట.. ఎందుకంటే..?

 

Previous articleవారానికి 70 గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన రాధికా గుప్తా..!
Next articleబాబోయ్!! పన్నీర్ ఇలా తయారు చేస్తారా..? ఏదో గుర్తుకు వస్తుంది అంటున్న నెటిజన్లు..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.