వీరిద్దరూ ప్రేమికులు కాదా..? ఫైమా ప్రవీణ్ ప్రేమని రిజెక్ట్ చేసిందా..? అసలు విషయం ఏంటంటే..?

Ads

ప్రవీణ్, ఫైమా జోడి పటాస్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. బుల్లితెర పై పలు కార్యక్రమాలలో పాల్గొని ఆడియెన్స్ ను అలరించారు. జబర్దస్త్ కామెడీ షోలో ప్రవీణ్, ఫైమా స్కిట్ లలో తమ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.

అయితే ప్రవీణ్, ఫైమా ఈ స్కిట్ లలో చాలా చనువుగా ఉండడం, వీరి పర్ఫామెన్స్ చూసినవారికి ప్రేమలో ఉన్నారేమో అనే అనుమానాలు కలుగుతాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు పలు వీడియోలు కూడా షేర్‌ చేశారు. అయితే తాజాగా ప్రవీణ్‌ ఫైమా గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.  అవుతున్నాయి.
ఫైమా, ప్రవీణ్‌ పలు బుల్లితెర షోలతో మెప్పించి, నటులుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. వీరు లవ్ లో ఉన్నట్టుగా, పెళ్లి చేసుకోబోతున్నారని రకరకాల వార్తలు వినిపించాయి. వీరిద్దరూ కూడా ప్రేమ, పెళ్లి గురించి పలు వీడియోలు షేర్ చేశారు. అయితే అవన్నీ యూట్యూబ్ ఛానల్ కోసం చేసిన వీడియోలని తెలుస్తోంది. ప్రవీణ్ ఫైమాతో లవ్ లో పడినట్లు పలు టీవీ స్టేజీలపై చాలా ఓపెన్‌గా చెప్పాడు.
ఫైమా ఇంటికి ప్రవీణ్‌ పలుమార్లు వెళ్ళడం, ఆ టైమ్ లో ఫైమా అమ్మని అత్తయ్య అని కూడా పిలవడం తెలిసిందే. ఇదంతా చూసి, ఇద్దరు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు నెట్టింట్లో బాగా ట్రెండ్‌ అయ్యింది. ఆయుతే ప్రవీణ్ వీటన్నిటి పై తాజాగా యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ పలు విషయాలను చెప్పుకొచ్చారు. ఫైమా పై ప్రేమ స్నేహంతోనే ప్రారంభం అయ్యిందని, తనను ప్రేమిస్తున్న విషయాన్ని  ఫైమాకి తెలిపానని, కానీ ఆమె దానికి నో చెప్పినట్టుగా వెల్లడించారు.
తన ప్రేమ గురించి చెప్పానని, దానిని అంగీకరించడం, అంగీకరించకపోవడం అనేది పూర్తిగా ఫైమా నిర్ణయం అని అన్నారు. తను ప్రేమను అంగీకరించకున్నా, తమ ఫ్రెండ్ షిప్ కొనసాగుతుందని ప్రవీణ్ చెప్పారు. ఫస్ట్ లవ్ ఈజ్ బెస్ట్ లవ్ అని అంటారు, ఆమెకు మొదటిసారి ప్రపోజ్ చేసినప్పుడు ఆమె  ఒప్పుకోకపోవడం అనేది బాధగా అనిపించి, ఏడ్చానని తెలిపారు. ఆమె ప్రస్తుతం అంగీకరించకపోయినా ఫ్యూచర్ లో తన లవ్ ను ఒప్పుకున్నా సంతోషమే అని ప్రవీణ్ తెలిపారు. ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Ads

Also Read: ప్రియాంక మోహన్ ఇలా బొద్దుగా మారడానికి కారణం ఆ హీరో అంట.. ఎందుకంటే..?

Previous article“సితార” ధరించిన ఈ లెహంగా కాస్ట్ ఎంతో తెలుసా..? సూపర్ స్టార్ కూతురు అంటే ఆ మాత్రం ఉండాలిలే..!
Next article“కృష్ణ ముకుంద మురారి” సీరియల్ లో ఇలా ఎందుకు చేశారు..? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.