“కృష్ణ ముకుంద మురారి” సీరియల్ లో ఇలా ఎందుకు చేశారు..? ఈ కొత్త ట్విస్ట్ ఏంటి..?

Ads

నేటి ఎపిసోడ్ లో కృష్ణ బ్యాగ్ తీసుకుని మురారి ఇంటికి వస్తుంది. రేవతికి కృష్ణ పైన ప్రేమ ఉన్నా, మురారి పరిస్థితి వల్ల కఠినంగా వ్యవహరిస్తుంది. కృష్ణను చూసి, భవానీ దేవి కోపంతో బయటికి పొమ్మని చెబుతుంది.

కృష్ణ మురారి సార్ పరిస్థితి బాలేదని, తాను అక్కడే ఉండాలని, బ్రతిమిలాడుతుంది. దాంతో భ‌వానీ మురారి బాగయ్యే వరకు కృష్ణ ఇంట్లో ఉండ‌టానికి అంగీకరిస్తుంది. ఎలాంటి బంధుత్వాలు పెట్టుకోకూడదని అంటుంది. దానికి కృష్ణ అంగీక‌రిస్తుంది. కృష్ణ‌ను అవుట్‌హౌజ్‌లో ఉండమని చెబుతుంది.
రాత్రి సమయంలో మురారీ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు. ముకుంద అక్కడికి వచ్చి మురారీతో ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఇలాంటి టైమ్ లో లవ్ చేసిన వాళ్లు పక్కన ఉంటే చాలా బాగుంటుందని చెబుతుంది. దాంతో తాను లవ్ చేసిన అమ్మాయి ఎక్కడా? అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు మురారీ తలపట్టుకుని విలవిలలాడుతాడు. దాంతో అందరూ అక్కడికి వస్తారు. కృష్ణ వచ్చి  మురారీకి ఇంజెక్షన్ వేస్తుంది. అప్పుడు ఆమెను మురారీ చూస్తూ ఉంటాడు.
ఆ తరువాత కృష్ణ మురారీతో ఎక్కువ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోమని చెప్పి, అతన్ని గదిలోకి పంపిస్తుంది. మురారీ సార్‌కి బాగయ్యక వెళ్లిపోతాను అని భవానీతో చెబుతుంది. ఆ తరువాత కృష్ణని ముకుంద అవుట్‌హౌజ్‌ కి తీసుకుని వెళ్తుంది. అక్కడ మురారి కోసం బాధ పడుతున్న కృష్ణని మాటలతో ఇబ్బంది పెట్టె ప్రయత్నం చేస్తుంది. మురారీకి నీ గురించి గుర్తు లేదు. మురారీని నేను ప్రేమిస్తున్నా, ఆ విషయాన్ని భవానీ అత్తయ్యతో ఎప్పుడో చెప్పేశాను. ఆమె నాకు సపోర్ట్ గా ఉందని అంటుంది.
కమింగ్ అప్ లో, కృష్ణ అవుట్‌హౌజ్‌ శుభ్రం చేస్తూ ఉంటే, చూసిన ముకుంద నవ్వుతూ ఎప్పటికీ నువ్వు ఇలానే ఉండాలని అనుకుంటుంది. అయితే ముకుంద ఊహించని విధంగా అక్కడికి మురారీ వస్తాడు. అదే సమయంలోనే స్టూల్ పై కృష్ణ నిల్చొని బూజు దులుపుతూ కింద‌ప‌డ‌బోతుంది. అది చూసిన మురారీ కృష్ణ కిందపడకుండా పట్టుకుంటాడు. వారిద్దరినీ అలా చూసిన ముకుంద రగిలిపోతుంది.

Ads

Also Read: వీరిద్దరూ ప్రేమికులు కాదా..? ఫైమా ప్రవీణ్ ప్రేమని రిజెక్ట్ చేసిందా..? అసలు విషయం ఏంటంటే..?

 

Previous articleవీరిద్దరూ ప్రేమికులు కాదా..? ఫైమా ప్రవీణ్ ప్రేమని రిజెక్ట్ చేసిందా..? అసలు విషయం ఏంటంటే..?
Next articleబాలీవుడ్ రీమేక్ అన్నారు..! కానీ ఈ విషయం ఆలోచించారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.