Ads
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ మూవీ సంచలనం విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వచ్చిన తెలుగు టాప్ బ్లాక్ బస్టర్స్ హిట్ సినిమాల లిస్ట్ లో స్థానం దక్కించుకుంది.
Ads
బేబీ మూవీ బాలీవుడ్ లో రీమేక్ కానుందనే న్యూస్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్ హిందీ వెర్షన్ కి దర్శకత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తనయుడు ఆర్యమాన్ ని బేబీ హిందీ రీమేక్ ద్వారా పరిచయం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే బాలీవుడ్ లో బేబీ వంటి బోల్డ్ కంటెంట్ ఇప్పటికే బోలెడు వచ్చాయి. ఇలాంటివి నార్త్ ప్రేక్షకులకు కొత్త కాదు. కరణ్ జోహార్ సినిమాల నుండి ప్రస్తుత వెబ్ సిరీస్ ల వరకు ఎన్ని వచ్చాయో లెక్క బెట్టడం కూడా కష్టమే. అది మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో తెలుగు రీమేక్ చిత్రాలు బాలీవుడ్ లో వర్కౌట్ అవడం లేదు.
ఆరెక్స్ 100 టాలీవుడ్ లో సృష్టించిన సంచలనంలో కాస్త కూడా నార్త్ లో కనిపించలేదు. జెర్సీని నానితో తెరకెక్కించిన దర్శకుడే షాహిద్ కపూర్ వంటి స్టార్ హీరోతో రీమేక్ చేశాడు. ఆ మూవీ కనీసం బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని తెలుస్తోంది. రాక్షసుడు, అల వైకుంఠపురములో, ఎంసిఏ, గద్దలకొండ గణేష్, హిట్ ది ఫస్ట్ కేస్ లాంటి సినిమాలన్ని ప్లాప్ అయ్యాయి. ఈ చిత్రాలన్ని కూడా స్టార్స్ తో తెరకెక్కించినవే. దానికి ఒక కారణం ఓటిటి అని చెప్పవచ్చు. ఒక భాషలో విజయం సాధించిన సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంటున్నాయి.
మంచి టాక్ వస్తే భాషతో సంబంధం లేకుండా సబ్ టైటిల్స్ పెట్టుకుని మరీ చూస్తున్నారు. ఇక ఓటీటీలో చూసిన సినిమాలను మళ్ళీ చూడడానికి ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బేబీ కంటెంట్ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి కారణం, ఆడియెన్స్ అభిరుచులు, ప్రస్తుత వాతావరణానికి అనుగుణంగా ప్రేమకథని తెరకెక్కించిన తీరు వల్ల, ఈ మూవీ విజయం సాధించదని, ఎప్పుటి నుండో ఇలాంటి స్టోరీలను చూస్తున్న బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం అంత ఈజీ కాదని అంటున్నారు.
Also Read: ఇవెక్కడి టైటిల్స్.. ఈ 7 సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి అదే కారణమా..?