ఆ హీరోయిన్ కోసం “వేణు స్వామి” చేసిన పూజలు ఫలిస్తాయా..? ఆమె ఎవరంటే..?

Ads

ప్రముఖ జ్యోతిష్య పండితుడుగా వేణు స్వామి ఈమధ్య కాలంలో సెలబ్రిటీలకన్నా ఎక్కువ పాపులారిటీ పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన సినీ ప్రముఖుల గురించి పొలిటీషియన్స్ జాతకాల గురించి చేసే కామెంట్స్ క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.

కొందరు సినీ సెలబ్రిటీలు వేణు స్వామితో పూజలు, జాతక దోష పరిహారాలు సైతం చేయించుకోవడం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ ఆషూ రెడ్డి ఇటీవల రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది. ఆ కారుకి వేణు స్వామితో పూజలు చేయించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ప్రముఖుల జాత‌కాలు చెబుతూ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చాలా పాపుల‌ర్ అయ్యారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య డైవర్స్ తో పాటు ప‌లువురు తెలుగు ప్ర‌ముఖుల గురించి వేణుస్వామి చెప్పిన విష‌యాలు కొన్ని చెప్పినట్టే జ‌ర‌గ‌డంతో ఆయన మాట‌ల‌ పై ఎక్కువ మందికి న‌మ్మ‌కం ఏర్పడింది. సాధారణ ప్రజలతో పాటు ప్రముఖ హీరోయిన్లు సైతం వేణుస్వామి చెప్పే జాత‌కాల్ని న‌మ్ముతున్న‌ట్లు తెలుస్తోంది.

కొన్నాళ్ల క్రితం టాలీవుడ్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న వేణుస్వామితో ప్రత్యేక పూజలు చేయించుకున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఆ తరువాత హీరోయిన్ నిధి ఆగ‌ర్వాల్, డింపుల్ హ‌యాతి ఇంట్లో వేణు స్వామి యాగం, పూజ‌లు నిర్వ‌హించారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియో కూడా సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. తాజాగా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన అషూ రెడ్డి తన కొత్త కారుకి వేణు స్వామితో పూజలు చేయించింది.
అషూ రెడ్డి 2 రోజుల క్రితం రేంజ్ రోవర్ కారు కొన్న విషయం తెలిసిందే. ఖరీదైన ఈ కారును ఆస్ట్రాలజర్ వేణు స్వామి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు. వేణు స్వామి ఈ కారుకు పూజ చేసే దిష్టి తీశారు. ఆ తరువాత కొబ్బరికాయ కొట్టారు. అషురెడ్డి టెంకాయ కొట్టి, వేణు స్వామి  పాదాలకు నమస్కరించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. కాగా, ‘మనల్ని అనుసరించే వాళ్ళు మన సలహాలని పాటిస్తూ ముందుకు వెళ్లే వాళ్ళని చూస్తే చాలా ఆనందం’ అని వేణు స్వామి చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.

Also Read: బాలీవుడ్ రీమేక్ అన్నారు..! కానీ ఈ విషయం ఆలోచించారా..?

 

 

Previous articleవిక్రమ్ లో డిలీట్ చేసిన సీన్ ఏంటో తెలుసా..? ఇంత మంచి సీన్ ఎందుకు డిలీట్ చేశారు..?
Next articleకారు కొన్న సమయంలో “పెద్ద కీ” తో ఫోటో వెనక ఇంత పెద్ద బిజినెస్ ఉందా.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.