Ads
తెలుగులో ఇటీవల కాలంలో విభిన్నమైన సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. అలా వచ్చిన మూవినే మా ఊరి పొలిమేర. కరోనా సమయంలో ఓటిటిలో రిలీజ్ అయిన ఈ మూవీ ఊహించిన విధంగా హిట్ గా నిలిచింది. నేడు రిలీజ్ అయిన ఈ మూవీ సీక్వెల్ మా ఊరి పొలిమేర 2 ఎలా ఉందో చూద్దాం..
- మూవీ: మా ఊరి పొలిమేర-2
- నటీనటులు: సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శ్రీను తదితరులు
- డైరెక్టర్: డాక్టర్ అనిల్ విశ్వనాథ్
- మ్యూజిక్: గ్యాని
- సినిమాటోగ్రఫీ: కుశేదర్ రమేష్ రెడ్డి
- నిర్మాత: గౌర్ కృష్ణ
- సమర్పణ: గౌరు గణబాబు
- రిలీజ్ తేది : నవంబర్ 3, 2023స్టోరీ:
చనిపోయాడని అనుకున్న కొమురయ్య, తాను ప్రేమించిన కవితతో కలిసి మరో ఊరు వెళ్లిపోవడంతో “పొలిమేర 1” స్టోరీ ఎండ్ అవుతుంది. “పొలిమేర 2” అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది. జాస్తిపల్లి నుండి వెళ్ళిన కొమురయ్యను వెతుకుతూ వెళ్ళిన కొమురయ్య తమ్ముడు జంగయ్య కూడా అదృశ్యం అవుతాడు.
ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ రవీంద్ర నాయక్ ఈ కేసుని రీఓపెన్ చేస్తాడు. జంగయ్యని వెతికే క్రమంలో ఎస్ఐకి కొమురయ్య ఆచూకీ తెలుస్తుంది. కొమురయ్య ఎందుకు చేతబడి చేస్తున్నాడు? ఈ స్టోరీకి, అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి ఉన్న కనెక్షన్ ఏమిటి? జాస్తిపల్లి పొలిమేరలో ఉన్న మిస్టరీ ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ:
Ads
పొలిమేర 1 ఓటీటీలో రిలీజ్ అవడంతో చాలా మంది చూశారు. దాంతో ‘పొలిమేర 2’ పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో ట్విస్ట్ లకి కొదవ లేదు. సీక్స్వెల్ కాబట్టి, స్టోరీలోకి వెళ్ళడానికి డైరెక్టర్ ఎక్కువ సమయం తీసుకోలేదు. కొమురయ్య పాత్ర ఎంట్రీతో కథ పరుగులు పెడుతుంది. అసలు స్టోరీ ఇంటర్వెల్ తర్వాత ప్రారంభం అవుతుంది. అప్పుడు వచ్చే ట్విస్టులు ఆశ్చర్య పరుస్తాయి. సస్పెన్స్ కొనసాగించారు. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఎక్కువ.
కొమరయ్య క్యారెక్టర్ కు ‘సత్యం’ రాజేష్ న్యాయం చేశారు. ఆల్రెడీ చేసిన క్యారెక్టర్ కావడంతో తేలికగా చేసుకుంటూ వెళ్లారు. ఈ మూవీలో కామాక్షీ భాస్కర్ల పాత్ర మరింత సర్‌ప్రైజ్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్స్ లో ఆమె పాత్రతో ట్విస్టులు కొన్ని రివీల్ చేశారు.
ప్లస్ పాయింట్స్:
- స్టోరీ పాయింట్,
- సెకండ్ హాఫ్
- క్లైమాక్స్ సీన్స్
- కొన్ని భయపెట్టే సీన్స్
మైనస్ పాయింట్స్: - ఊహకు అందే స్టోరీ
- జరిగిందే జరిగినట్టుగా ఉన్న కొన్ని ట్విస్ట్ లు
- లాజిక్ లేని సీన్స్
రేటింగ్:
2.5/5
చివరి మాట:
హారర్ చిత్రాలను, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడేవారు ఈ మూవీ చూడవచ్చు. పొలిమేర 2 ఒకసారి చూడగలిగే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.
watch trailer :
Also Read: KEEDAA COLA REVIEW : తరుణ్ భాస్కర్ – బ్రహ్మానందంల “కీడా కోలా” ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!