Ads
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో ముంబై క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. నవంబర్ 1న స్వయంగా సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగానే ఈ విగ్రహావిష్కరణ జరిగింది. వాంఖడే స్టేడియంలో సచిన్ స్టాండ్ పక్కనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఈ విగ్రహాన్ని సచిన్ ఆఫ్‌సైడ్ షాట్ ఆడే పోజ్‌లో రూపొందించారు. కానీ ఎంసీఏ పైన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సచిన్ విగ్రహమని, ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ విగ్రహాన్ని పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ విగ్రహం పై ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అసంతృప్తి తెలుపుతున్నారు. దానికి కారణం సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ను పోలి ఉండటమే. దీనిపై సచిన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందించలేదని రూపకర్త పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విగ్రహం పై సెటైర్లు వేస్తున్నారు. ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను ఘోరంగా ఆడుకుంటున్నారు నెటిజెన్లు.
తాజాగా వాంఖడే స్టేడియంలో భారత్-శ్రీలంక జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించిన అభిమానులు అక్కడే ఉన్న సచిన్ విగ్రహాన్ని చూసి ఎవరికి తోచినట్లు వారు సోషల్ మీడియాలో కామెంట్లు, మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ జరిగినప్పటి నుండి సచిన్ విగ్రహం హాట్ టాపిక్ గా మారింది. అహ్మదాబాద్ కు చెందిన ప్రమోద్ కాంబ్లే సచిన్ విగ్రహాన్ని తయారుచేశారు.
ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌ను ముంబై క్రికెట్ అసోసియేషన్ బాగా గౌరవించిందని ఒక నెటిజెన్ ట్వీట్ చేస్తే, తన స్టాచ్యూని వాంఖడేలో పెట్టడం ఆనందంగా ఉందంటూ స్టీవ్ స్మిత్ పేరుతో ఉన్న ఫేక్ ఖాతా నుండి ఒకరు ట్వీట్ చేశాడు. మరొకరు టెస్టు క్రికెట్లో స్టీవ్ స్మి్త్‌కు యావరేజ్‌ను గుర్తించిన తెలివైన ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు స్మిత్ స్టాచ్యూని పెట్టారంటూ కామెంట్ చేశాడు. మరొకరు కేజీఎఫ్ సీన్ తో పోలుస్తూ వీడియో షేర్ చేశారు.
Also Read: నిన్నటి వరకు ఈ ప్లేయర్ ని తిట్టారు… ఇప్పుడు ఏమో పొగిడేస్తున్నారు… పైగా కవరింగ్ కూడా…!