Ads
ఐసీసీ వరల్డ్ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీం ఇండియాకి పెద్ద షాక్ తగిలింది. పూణేలో బాంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాకి ఎడమ చీలమండకి గాయం అయ్యింది. గాయం కారణంగా ఇబ్బంది పడిన హార్దిక్, ఆ తర్వాత జరిగిన ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మ్యాచ్ లకు దూరం అయ్యాడు. దీంతో హార్దిక్ పాండ్యా స్థానంలో సీమర్ ప్రసీద్ కృష్ణ ఆడబోతున్నాడు.
ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మిగిలిన మ్యాచ్ లలో కోలుకుంటాడు అని అనుకున్నారు అని, కానీ ఆలా అవ్వలేదు అని ఐసీసీ యాజమాన్యం తెలిపింది. మ్యాచ్ లకి దూరం అవ్వడం చాలా బాధగా ఉంది అని హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Ads
ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ, “వరల్డ్ కప్ లో మిగిలిన మ్యాచ్ లని ఆడే అవకాశాన్ని నేను కోల్పోయాను అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను టీం తోనే ఉంటాను. ప్రతి ఆటలో ప్రతి బాల్ కి టీంని చీర్ చేస్తూ ఉంటాను. ఈ ప్రేమకి ధన్యవాదాలు. మీ సహకారం అద్భుతం. ఈ టీం నాకు చాలా ప్రత్యేకమైనది. మేము మీ అందరిని గర్వపడేలా చేస్తాము. మీ హార్దిక్ పాండ్యా” అని హార్థిక్ పాండ్యా తన సోషల్ మీడియా పోస్ట్ లో రాశారు.
టీం ఇండియా తరపున ప్రసీద్ కృష్ణ 17 వన్డేలు ఆడి 29 వికెట్లు పడగొట్టారు. వరల్డ్ కప్ మొదలు అయ్యే ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో చివరి సారిగా పేసర్ గా ఆడారు. ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్న మ్యాచ్ లో ఇతను పాల్గొనబోతున్నారు. ఇప్పటికే టీం ఇండియా ఆడిన ఏడు మ్యాచ్ లలో ఏడు విజయాలు నమోదు చేసుకొని పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో ఉంది.
ALSO READ : ఇదేందయ్యా ఇది.. సచిన్ స్టాచ్యూ అన్నారు.. కానీ ఆ బ్యాట్స్ మెన్ లాగా ఉన్నాడు..?