Ads
మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు కంటూ ఉంటాం.కలలు రావడం అనేది సర్వ సహజం. అయితే ఒక్కోకలకు ఒక్కో అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రంలో వాటి గురించి వివరంగా చెప్పారు.మనం పడుకునే టైం బట్టి వచ్చే కలలు కొన్ని నిజమయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉంటారు. పగటిపూట కలలు కనేవారు ఉన్నారు. కానీ పగటిపూట కనిపించే కలలు పనిచేయవు. తెల్లవారుజామ 03:30 నుండి 6 గంటల మధ్య వచ్చే కలలు ఫలితాలను ఇస్తాయని చెబుతారు. కలలు మన లోతైన కోరికలకు ప్రతిరూపాలు.
ఆధునిక శాస్త్రం కూడా అదే చెబుతుంది.మన నిత్యజీవితంలో మన నెరవేరని కోరికలు సంఘటనలు మన మనసు లోతులో దాగి ఉంటాయి. మనం వాటిని నెరవేరాలి అనుకున్నప్పుడు అది ఒక కలగా ఉద్భవిస్తుంది. ఇది మన భవిష్యత్తును చెప్పే అద్దమని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు.
Ads
వాటి ప్రకారం మీరు చూసే ప్రతి కల మీ భవిష్యత్తు గురించి సూచన ఇస్తుంది దానిని సరిగా అర్థం చేసుకోవడం మన చేతిలోనే ఉంది. కలలు సాధారణంగా అదృష్టం, నగదు ప్రవాహం, దుఃఖం, నష్టాలు మొదలైన వాటిని సూచిస్తాయి.మీరు బయటకు చెప్పని మంచి కలలు తప్పకుండా నెరవేరుతాయి. చాలాసార్లు మనకు ఉదయాన్నే వచ్చే క.ల మాత్రమే గుర్తుంటుంది. బహుశా మనం రాత్రులు వచ్చే కలని గుర్తుంచుకుంటే అది త్వరలోనే నిజమవుతుంది. స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లవారుజాము మూడు నుండి నాలుగు గంటల మధ్య వచ్చే కలలు మూడు నెలల్లోనే నెరవేరుతాయి.
మీరు కలలో జామకాయను చూస్తే ధనవంతులు కావాలనే కోరిక నెరవేరుతుందని అర్థం. ఐస్ క్రీమ్, వాల్ నట్లు తిన్నట్లు కలగన్నట్లయితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మీ మనసు బాగుంటుంది.ఆకస్మిక సంపద వచ్చే అవకాశం ఉంది కలలో చింతపండు తినడం మంచి పనికి సంకేతం కాని స్త్రీలకు మాత్రమే శుభప్రదంగా పరిగణించబడుతుంది. మీరు మామిడి పండును రుచి చూడాలని కలగన్నట్లయితే మీరు అపారమైన సంపాదన పొందుతారు అని అర్థం. ఇలా ఒక్కొ కలకి ఒక అర్ధాన్ని చెబుతుంది శాస్త్రం. ఏదేమైనా కొన్ని కలలు నెరవేరుతాయి, కొన్ని నెరవేరవు.
Also Read:30+ వయసు దాటాక పెళ్లి చేసుకుంటే…ఎదురుకోవాల్సిన 5 ప్రధాన సమస్యలు ఇవే.! తప్పక తెలుసుకోండి.!