ఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న ఈ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌ చూసారా.? ఎక్కడ చూడొచ్చు అంటే..?

Ads

శ్రద్ధా శ్రీనాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘జెర్సీ’ మూవీతో తెలుగులో అడుగుపెట్టి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ చిత్రాలలో శ్రద్ధా శ్రీనాథ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్న ‘సైంధవ్’ త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఆమె కన్నడలో కొన్నేళ్ళ క్రితం నటించిన చిత్రం ‘ఆపరేషన్ అలమేలమ్మ’. ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైతాన్ ఫేమ్ వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ రిషి కూడా నటించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జోనర్ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది.
జెర్సీ మూవీలో తన నటనతో ఆకట్టుకున్న శ్రద్ధా శ్రీనాథ్‌, ఆ మూవీ తర్వాత శ్రీకృష్ణ అండ్‌ హిజ్‌ లీలీ, జోడి, చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం ఆమె సినిమాలలో నటిస్తూనే, ఓటీటీల్లో కూడా  అలరిస్తోంది. విక్టరీ వెంకటేష్‌ నటిస్తున్న సైంధవ్‌ మూవీలో నటిస్తోంది. కాగా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించిన కన్నడ మూవీ ఆపరేషన్‌ అలమేలమ్మ 2017లో రిలీజ్ అయ్యి, సూపర్‌ హిట్‌గా నిలిచింది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సునీల్ కుమర్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌కు జంటగా సైతాన్‌ వెబ్‌ సిరీస్‌ నటుడు రిషి నటించాడు. రాజేష్‌ నటరంగ, షీలమ్‌, అరుణ్‌ బాలాజీ, ధీరజ్‌ శెట్టి, విశ్వవిజేత్‌ కీలక క్యారెక్టర్స్ లో నటించారు. స్టోరీ నచ్చడంతో ఈ మూవీని కేజీఎఫ్‌ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ అక్టోబర్ 27 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, ప‌ర‌మేష్ అనే యువ‌కుడు అనాథ. డ‌బ్బు పై ఉన్న మోజుతో పెద్ద పారిశ్రామికవేత్త కొడుకును కిడ్నాప్ చేస్తాడు. అయితే ప‌ర‌మేష్ చేసిన కిడ్నాప్ అతన్ని ఇబ్బందిలో పడేస్తుంది. ఆ కిడ్నాప్‌ వల్ల పరమేష్‌ లైఫ్ లో ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి? కిడ్నాప్‌ డ్రామాతో అనన్య అనే టీచర్‌కు ఉన్న సంబంధం ఏంటి అనేది మిగతా కథ.

Ads

Also Read: “వెంకటేష్” తో కలిసి “మహేష్ బాబు” పేకాట అంటూ వైరల్ అయిన ఫోటో వెనక అసలు కథ ఇది..!

Previous articleతన సినిమా కోసం మహేష్ బాబుకి రాజమౌళి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా..?
Next articleసెలబ్రిటీస్ కి ఇచ్చిన అయోధ్య రామ మందిరం ఆహ్వాన పత్రిక చూసారా..? ఇందులో ఏం రాసి ఉందంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.