Ads
వన్డే వరల్డ్ కప్ 2023లో టీం ఇండియా వరుస విజయాలతో సెమీఫైనల్స్ వరకు దూసుకు వచ్చింది. ఇక ఈ లీగ్ చివరి మ్యాచ్ ను నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడడానికి భారత్ సిద్ధంగా ఉంది. నెదర్లాండ్స్ టీం ని ఓడించడం భారత్ కు నల్లేరు మీద నడకతో సమానం అనడంలో ఎటువంటి డౌటు లేదు.. అయితే అసలు ముప్పు ఆ తర్వాతే ఉంది. ఈ టోర్నమెంట్ లో భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్లలో రోహిత్ సేన మంచి ఫామ్ లో చక్కటి ప్రదర్శన కనబరుస్తోంది.
అయితే 2015 వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ నుంచి టీమిండియాను వరుసగా సెమీస్ గండం వెంటాడుతూనే ఉంది. వన్డే మ్యాచ్ అయినా టి20 ప్రపంచ కప్ అయినా టీమిండియా కు సెమీస్ పెద్ద సమస్యగా మారుతుంది. టీమ్ ఇండియా 2015 వన్డే ప్రపంచ కప్ ఆస్ట్రేలియా చేతిలో ఓడగా ..2019 వన్డే వరల్డ్ కప్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ విషయం ప్రస్తుతం అభిమానులను కలవరపెడుతోంది.
Ads
లీగ్ స్టేజ్ వరకు భయంకరమైన ఫామ్ కనబరుస్తూ ముందుకు వెళ్లే టీమ్ ఇండియా సెమీస్ లో తడబడుతోంది. టి20 ప్రపంచ కప్ పరిస్థితి కూడా ఇదే. మరీ ముఖ్యంగా 2022 టి 20 ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో భారీ ఓటమి చవిచూసింది. ఈసారి ప్రపంచ కప్ పొందాలి అన్న పట్టుదల టీమ్ ఇండియాలో కనిపిస్తున్నప్పటికీ.. కప్ దక్కించుకోవాలి అంటే సెమీస్ గండం గట్టెక్కాలి. మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్న డైలమా అభిమానుల్లో నెలకొని ఉంది.