Ads
సాంకేతికత అనేది అన్ని రంగాలకు వ్యాపించింది. ఇక క్రికెట్ లో కూడా టెక్నాలజీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం నుంచి డీఆర్‌ఎస్ వరకు క్రికెట్ రూపాంతరం చెందుతూ ఉంది. టెక్నాలజీ వల్ల అంపైర్ల పని కూడా చాలా ఈజీ అయ్యింది.
అల్ట్రా ఎడ్జ్, హాట్‌స్పాట్, హకాయ్, బాల్ ట్రాకింగ్, స్టంప్ మైక్రొఫోన్ లాంటివి ఇప్పుడు క్రికెట్‌లో కామన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్ట్రా ఎడ్జ్ టెక్నాలజీ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం..
క్రికెట్ మ్యాచ్ లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడంలో అంపైర్లకు సహకరించేందుకు డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్‌ఎస్)ను ప్రారంభించారు. డునెడిన్‌లోని యూనివర్శిటీ ఓవల్‌లో న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో ఐసీసీ మొదటిసారిగా 2009లో నవంబర్ 24న అధికారికంగా డీఆర్‌ఎస్ ను ప్రారంభించింది.
తొలుత, ఐసీసీ అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లలో డీఆర్‌ఎస్ ని తప్పనిసరి చేసింది. కానీ సాంకేతికత వంద శాతం ఖచ్చితమైన ఫలితాలను చెప్పలేకపోవడం వల్ల పదేపదే వివాదంగా మారింది. చాలా సందర్భాల్లో, డీఆర్‌ఎస్ క్రికెటర్లను కలవరపరిచే డిసిషన్స్ తో ముందుకు వచ్చింది. దాంతో దాని వినియోగాన్ని ఐచ్ఛికం చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లకు సంబంధించినంతవరకు ఇరు జట్లు అంగీకరిస్తేనే డీఆర్‌ఎస్ వాడుతారు. ఐసిసి ఈవెంట్లలో 2011లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ నుండి డిఆర్‌ఎస్ తప్పనిసరి చేసింది.
థర్డ్ అంపైర్ నిర్ణయాలను సమీక్షించడానికి అల్ట్రా-ఎడ్జ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. అల్ట్రా-ఎడ్జ్‌కు స్టంప్ లో అమర్చిన మైక్రోఫోన్ సహాయం చేస్తుంది. ఈ సాంకేతికత స్టంప్‌ల లోపల ఉంచిన మైక్‌లను మరియు పిచ్ పై మరియు గ్రౌండ్ చుట్టూ అమర్చిన విభిన్న కెమెరాలను ఉపయోగిస్తుంది. మ్యాచ్ ఆడే సమయంలో బంతి తాకినపుడు బ్యాట్, ప్యాడ్‌లు మరియు దుస్తులు సృష్టించే శబ్దాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఎల్బిడబ్ల్యు మరియు బ్యాట్-ప్యాడ్ పరిస్థితులలో క్లోజ్ కాల్‌లను నిర్ణయించడానికి అంపైర్లకు అల్ట్రా-ఎడ్జ్‌ని సహాయపడుతుంది.
Ads
watch video:
Also Read: వరల్డ్ కప్ లో టీమ్ ఇండియాకి పొంచి ఉన్న అసలైన గండం…అది దాటి కప్పు గెలవగలరా.?