Ads
భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీలో భారతజట్టు అద్భుతమైన ఫామ్ తో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలుపు సాధించి, అపజయం ఎరుగని జట్టుగా రాణిస్తోంది.
Ads
ఇక భారత జట్టు సాధించిన విజయాల్లో జట్టులోని ప్రతి ప్లేయర్ కృషి, ఉంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం బౌలింగ్. ప్రపంచ కప్ మొదట్లో తొలి 5 మ్యాచ్‌లు భారత జట్టు ఛేజింగ్ చేస్తూ విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లలో టీమిండియాకు అవతలి జట్టు నుండి భారీ స్కోర్ ఎదురుకాలేదు. దానికి కారణం, భారత బౌలర్ల అద్భతమైన ప్రదర్శన. ఆస్ట్రేలియా, పాకిస్థాన్ వంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్లను సైతం భారత బౌలర్లు 200 స్కోర్ ను దాటనివ్వలేదు. ఇంగ్లండ్‌ను 129కి, శ్రీలంకను 55కి ఆలౌట్ చేశారు. భయంకరమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాను సైతం 83కే కుప్పకూల్చారు. స్పిన్‌కు అనుకూలించే భారత పిచ్‌ల పై టీంఇండియా ముగ్గురు భారత్ పేసర్లతో ఆడుతోంది. జస్పీత్ర్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ.
ఒకే సమయంలో ఈ ముగ్గురు ఇంతలా ఆడడం భారత్ ఎప్పుడు చూడలేదనే చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. 1972లో జూన్ 20న పరాస్ మాంబ్రే ముంబైలో జన్మించారు. చిన్నప్పటి నుండే క్రికెట్ అంటే అమితాసక్తితో పెరిగాడు. 15 సంవత్సరాల తరువాత ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దానికి ముందు గల్లీ క్రికెట్ ఆడేవాడు. ఆ తర్వాత తండ్రికి ఆసక్తిని చెప్పి, సచిన్‌కు కోచింగ్ ఇచ్చిన కోచ్ అజయ్ మంజ్రేకర్ వద్ద శిక్షణ తీసుకుని, దేశవాళీ క్రికెట్‌లో తన సత్తా చాటాడు. అక్కడ అత్యుత్తమైన బౌలర్లలో మాంబ్రే ఒకడిగా ఉన్నారు.
అతని కెరీర్‌లో 91 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో, 284 వికెట్లు, 83 లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 111 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ తో 1996 మే 23న అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఎక్కువ రోజులు జట్టులో కొనసాగలేకపోయారు. భారత జట్టు తరఫున 2 టెస్టులు, 3 వన్డేలు మాత్రమే ఆడారు. 2021 నవంబర్ నుంచి టీమిండియా కోచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వచ్చిన తరువాత మాంబ్రేను బౌలింగ్ కోచ్‌గా నియమించారు.
Also Read: ఇండియా టీంలోకి ఈ ఓవరాక్షన్ ప్లేయర్ అవసరమా రోహిత్.? ఐపీఎల్ లోనే చాలా ఓవర్ చేసాడు.!