ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఈ “హన్సిక” వెబ్ సిరీస్ చూసారా.? అసలు ఇందులో ఏముంది.?

Ads

ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. థియేటర్ల కంటే ఎక్కువగా ఓటీటీ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ అనే తేడా లేకుండా అన్నింటినీ బాగా ఆదరిస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు నుంచి వెబ్ సిరీస్ ల వరకు చాలా వరకు డైరెక్ట్ గా ఓటీటీ లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని వెబ్ సిరీస్ లు దూసుకుపోతున్నాయి. అటువంటి వాటిలో హీరోయిన్ హన్సిక నటించిన మై 3వెబ్ సిరీస్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది. పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లో నటించింది హన్సిక.

మై 3 అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ మంచి సక్సెస్ ను సాధించిన సందర్భంగా హీరోయిన్ హన్సిక దాంతో హన్సిక ఒక ఎమోషనల్ నోట్ ను కూడా షేర్ చేసింది. గార్డియన్‌, మై నేమ్‌ ఈజ్‌ శృతీ చిత్రాలు తనకు చాలా ప్రత్యేకమైన సినిమాలు అని తెలిపింది. అలాగే 2024 తనకు చాలా స్పెషల్ అని తెలిపింది హన్సిక.

Ads

ఇకపోతే హన్సిక విషయానికి వస్తే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 105 నిమిడంగళ్‌, తమిళంలో మ్యాన్‌ అనే సినిమాలు చేస్తోంది హన్సిక. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చిన్న సినిమా పెద్ద సినిమా వెబ్ సిరీస్ అనే సంబంధం లేకుండా నటిస్తూ దూసుకుపోతోంది హన్సిక. కాగా ఈమె మొదట దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.

Previous article5 ఏళ్ల తర్వాత తనని కలవడానికి వస్తున్న ప్రియుడికి విమానాశ్రయంలోనే పెద్ద షాక్ ఇచ్చిందిగా ఈ అమ్మాయి.!
Next articleబేబమ్మ లాగే…ఇక్కడ అవకాశాలు తగ్గి మలయాళ బాట పడుతున్న టాప్ హీరోయిన్లు ఎవరంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.