Ads
ప్రస్తుత రోజుల్లో చాలామంది చదివిన చదువుకు సరైన సంపాదన లేక సరైన ఉద్యోగాలు లేక ఆఫీసులో చుట్టూ కాళ్లలో చెప్పులు అరిగిపోయేలా ఏళ్ల తరబడి తిరుగుతూ ఉంటారు. మరికొందరు ఉద్యోగాలపై ఆశలేఖ సొంతంగా చదువుకోకపోయినా కూడా వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో చాలామంది పెద్దపెద్ద చదువులు చదివినప్పటికీ వాటిని పక్కన పెట్టి తెలివితో బిజినెస్ లు చేస్తూ వారితో పాటు ఎంతో మంది ఉపాధి కలిగిస్తున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక వ్యక్తి కూడా ఒకరు. ఉద్యోగం నుంచి తీసేశారని నిరాశచెందకుండా పంతం పెంచుకున్నాడు.
ఎలాగైనా సొంత కాళ్ల మీద నిలబడాలని బలంగా నిర్ణయించుకున్నాడు. చివరకు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడమే కాకుండా దాదాపుగా 100 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. వెరైటీ ఐడియాతో లక్షలు సంపాదిస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలీలోని దేహ్ పోలీస్ స్టేషన్ పరిధి లోధ్వరీ గ్రామానికి చెందిన సోనూ శ్రీవాస్తవ కొన్నేళ్ల క్రితం ఫొటో స్టూడియోలోని కలర్ ల్యాబ్‌లో టెక్నికల్ ఇంజనీర్‌గా పని చేస్తుండేవాడు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగుతున్న అతడి జీవితాన్ని కరోనా మహమ్మారి తారుమారు చేసేసింది. చాలా మంది మాదిరే శ్రీవాస్తవ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఉద్యోగం నుంచి తొలగించడంతో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి చేరాడు. ఏం చేయాలో తెలియక చాలా రోజుల పాటు ఆలోచించసాగాడు.
Ads
చివరికి ఎలాగైనా ఏదో ఒక వ్యాపారం చేసి తన గత జీవితం కంటే ఉన్నతంగా జీవించాలని బలంగా నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రా నగరాన్ని సందర్శిచడానికి వెళ్లిన సమయంలో అతను అక్కడి ప్రాంతంలో ఫేమస్ అయిన పేటా అనే స్వీట్‌ని రచి చూశాడు. అది అతడికి ఎంతో నచ్చింది. దీన్నే తన సొంతూర్లో ఎందుకు తయారుచేయకూడదని అనుకున్నాడు. తర్వాత అక్కడ పేటా తయారు చేసే వారి నుంచి మెలకువలు నేర్చుకొని అనంతరం ఇంటికి వచ్చి సొంతంగా పనులు ప్రారంభించాడు. ఇందుకోసం మొదట తక్కువ స్థాయిలో తెల్ల గుమ్మడికాయలను కొనుగోలు చేసి కొద్ది మందిని నియమించుకొని పేటా స్వీట్ తయారు చేయడం మొదలెట్టాడు. ఇలా మొదలైన తన వ్యాపార ప్రస్తానం ప్రస్తుతం రాష్ట్ర నలుమూలలకు వరకూ విస్తరించింది.
ప్రస్తుతం శ్రీవాస్తవ వద్ద వంద మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. తెల్ల గుమ్మడికాయలను చిన్న చిన్న ముక్కులుగా కట్ చేయడం, తర్వాత వాటిని పెద్ద బాణిలో ఉడికిస్తారు. చివరకు అందులో చక్కెరను మిక్స్ చేయడం ద్వారా పేటా స్వీట్‌ను సిద్ధం చేస్తారు. తన సక్సెస్ పై శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన వద్ద తయారైన స్వీటుకు మంచి డిమాండ్ ఉందని, రాయ్‌బరేలీ, ఫతేపూర్, ప్రతాప్‌గఢ్, కౌష్బీ, సుల్తాన్‌పూర్, అమేథీ, సహా యూపీలోని అనేక జిల్లాలకు సరఫరా అవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి రూ.8నుంచి రూ.9లక్షల వరకు ఆదాయం వస్తోందని తెలిపాడు శ్రీవాస్తవ చెబుతున్నాడు.
article sourced from: andhrajyothy