Ads
యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ 2023 మ్యాచ్ లలో టీం ఇండియా స్టార్ పెర్ఫార్మెన్స్ తో దూసుకుపోతోంది. గాయాల కారణంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో జరగబోయే నాకౌట్ మ్యాచ్లలో టీం ఇండియా విజయంపై ప్రభావం పడే అవకాశం ఉంది. పాండ్యాకు ప్రత్యామ్నాయంగా జట్టులో ఓ నికార్సైన ఆటగాడు లేకపోతే అది మైనస్ ఏ కదా. ఎలా అనుకునే సమయంలో తెలుగు తేజం రవితేజ ఎంట్రీ ఇచ్చాడు.
ఎన్నో కీలకమైన సందర్భాలలో బౌలింగ్ తోనే కాకుండా బ్యాటింగ్ తో కూడా టీం ను ఆదుకున్న ఆల్రౌండ్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా. మెగా టూర్నిలో జరగబోయే నాకౌట్ మ్యాచ్లకు టీం ఇండియాకు ఎంతో అవసరమైన ప్లేయర్.. కానీ గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. మరో పక్క రవితేజ జూనియర్ పాండ్యాగా రాణిస్తున్నాడు. ఇటీవల టీ20 ఫార్మాట్‌లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో ఆడిన ఏడు మ్యాచులలో 19 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్ కి పెద్దగా అవకాశం రాలేదు కానీ వస్తే తన సామర్థ్యాన్ని కచ్చితంగా చూపించేవాడు.
ప్రస్తుతం కాలి మడమ గాయం కారణంగా కేవలం వరల్డ్ కప్ నుంచే కాక హార్దిక్ సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20 సిరీస్ మ్యాచ్లకు కూడా దూరం అవుతాడు. దీంతో రెగ్యులర్ కెప్టెన్ బాధ్యతలను హార్దిక్ స్థానంలో సూర్య కుమార్ యాదవ్ కు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. సూర్య కుమార్ కాదు అనుకుంటే నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్ కు ఈ బాధ్యతను వెళ్లే ఛాన్స్ ఉంది.