Ads
పూర్వం రోజుల్లో మన పెద్దలు సూర్యోదయం కాకముందే లేచి శుభ్రంగా వంట వార్పు చేసుకొని పనులకు వెళ్లిపోయేవారు. తర్వాత సాయంత్రం సూర్యోదయం అయిన తర్వాత గంట లోపు నిద్రపోయేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం మనుషులు అందుకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. మనుషుల జీవన శైలి పూర్తిగా మారిపోయింది. రాత్రి 10,11 మిడ్ నైట్ వరకు మేలుకోవడం తెల్లవారినా కూడా ఏడు ఎనిమిది గంట వరకు అలాగే పడుకోవడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది మిట్టమధ్యాహ్నం వరకు పడుకునే వారు కూడా ఉన్నారు. కొంతమందికి రాత్రిళ్లు అంతగా నిద్ర పట్టదు.
ఒకవేళ నిద్ర పోయినా కూడా ఉదయం 3 గంటల నుంచి ఐదు గంటల ప్రాంతంలో మెలకువ వస్తూ ఉంటుంది. అయితే ఇది తరచుగా జరగకపోయినా కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతూనే ఉంటుంది. అయితే అలా తెల్లవారుజామున సమయంలో ఎందుకు మెలకువ వస్తుంది?దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూర్వికులు తెల్లవారకముందే నిద్ర లేచి చక చకా పనులు పూర్తి చేసుకుని ఏడు గంటల లోపు అంతా ఎవరికి వారు పొలంపునులకు వెళ్లిపోయేవారు. సాయంత్రం ఏడు గంటల తర్వాత ఎవరు నిలవదు ఉండేవారు కాదు. మంచి క్రమశిక్షణ పాటించడం వల్ల అప్పట్లో వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఆరోగ్యంగా జీవించడంతోపాటు ఎటువంటి సమస్యలు లేకుండా 100 ఏళ్ళు, అంతకంటే ఎక్కువగా జీవించిన వారు కూడా ఉన్నారు.
Ads
కానీ ఈ రోజుల్లో మనుషులు అలా లేరు. సూర్యోదయం అయినా కూడా నిద్ర లేవకుండా పడుకునే వారి సంఖ్య చాలానే ఉంది. ముఖ్యంగా సిటీలలో అయితే మిట్ట మధ్యాహ్నం 12 అయినా కూడా పడుకునే వారు చాలామంది ఉన్నారు. కొందరికి కొన్ని కారణాల వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టదు. మరికొందరు చాలా లేటుగా పడుకోవడం వల్ల మధ్యలోనే మెళకువ అవుతుంది. అయితే ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చే వారి జీవితంలో విశేషాలు జరుగుతాయని కొందరు ఆధ్యాత్మిక వాదులు పేర్కొంటున్నారు.
ఉదయం 3 నుంచి 5 గంటల కాలాన్ని బ్రహ్మమహూర్తం అంటారు. ఈ సమయంలో దేవాలయాలు తెరిచి దేవుళ్లకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. మనుషులు కూడా ఈ సమయంలో నిద్ర లేచి తమ పనులు చేయడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయట. అయితే అనుకోకుండా ఉదయం 3 నుంచి 5 గంటల లోపు మెళకువ వచ్చేవారికి త్వరలో వారి సంపద వృద్ధి చెందుతుందని అర్థం. అప్పటి నుంచి వారి జీవితం కూడా మారిపోతుందట. ఈ సమయంలో వారికి అప్రమత్తం చేయడానికే మెళకువ చేస్తారని కొందరు చెబుతున్నారు. ఈ సమయంలో అనుకోకుండా మెళకువ రాకున్నా నిద్ర లేని పూజలు చేయడం వల్ల అనుకున్నవన్నీ నెరవేరుతాయని కొందరు అంటున్నారు.