ఏడాదిన్నర కాలంలో 37 మంది మృతి..హైదరాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలకు కారణం ఇదేనా.?

Ads

హైదరాబాద్ నాంపల్లిలోని బజార్​ఘాట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందారు. కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

బజార్‌ఘాట్‌లోని ఒక కెమికల్ గోడౌన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కెమికల్స్ ని అక్రమంగా నిల్వ చేస్తున్నట్లుగా  చాలాసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని అక్కడివారు ఆరోపిస్తున్నారు.
కెమికల్ గోడౌన్‌ ఉన్న ఈ అపార్టుమెంటులో దాదాపు అరవై కుటుంబాలు నివసిస్తున్నట్లు సమాచారం. సెల్లార్ లోని కెమికల్ గోడౌన్‌ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. 4 అంతస్తులకు మంటలు వరకు  వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, జీహెచ్‌ఎంసీ ఆఫీసర్స్ ఘటనాస్థలి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా, వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొంత మంది తీవ్రంగా గాయపడగా హాస్పటల్ కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

Ads

image credits: etv bharat

కెమికల్ గోడౌన్‌ నిర్వహించడానికి సాధారణంగా స్థానిక సంస్థల నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పర్మిషన్ తీసుకున్న ప్రాంతంలో కాకుండా కెమికల్ గోడౌన్స్ ఇతర చోట్ల అక్రమంగా నిర్వహిస్తున్నారని అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్‌రింగ్‌ రోడ్డులోని ఎరుపు, ఆరెంజ్ కేటగిరిలోని దాదాపు 1350 ఇండస్ట్రీలను బయటకి  తరలించాలనే ప్రపోజల్ చాలా కాలం నుండి ఉన్నప్పటికీ, పూర్తిగా అమలు కావడం లేదని తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా 2021లో 139 అగ్ని ప్రమాదాలు, 2022లో 236 అగ్ని ప్రమాదాలు సంభవించగా, ఈ సంవత్సరం ఆగస్టు వరకు 132 అగ్ని ప్రమాదాలు సంభవించినట్టు తెలుస్తోంది. బజార్​ఘాట్ ఫైర్ యాక్సిడెంట్ తో పాటు, సంవత్సరన్నర కాలంలో హైదరాబాద్ లోనే 5 భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ దుర్ఘటనల్లో 37 మంది మృతి చెందారు. గత ఏడాది మార్చిలో సికింద్రాబాద్ బోయిగూడలో ఒక గోడౌన్‌ సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ లో పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత సెప్టెంబరులో సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని సెల్లార్ లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు.
సెల్లార్‌లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో జరిగిన షార్ట్‌ సర్క్యూట్ వల్ల ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్ లో నల్లగుట్టలో డెక్కన్ నిట్‌ వేర్ మరియు స్పోర్ట్స్‌ షాపులో సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ లో ముగ్గురు మృతి చెందారు. మార్చిలో సికింద్రాబాద్ లో సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ లో క్యూ నెట్ కంపెనీకి చెందిన ఆరుగురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు నాంపల్లి బజార్ ఘాట్‌లో సంభవించిన ఫైర్ యాక్సిడెంట్ లో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: కేవలం రూపాయికే నాలుగు గ్యాస్ సిలిండర్లు… తెలంగాణలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లకు పెద్ద షాక్ ఇచ్చారుగా.?

Previous articleపుట్టిన రోజు నాడే చనిపోయిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ మీకు గుర్తు ఉందా..?
Next articleఎలాంటి చెడు అలవాట్లు లేవు…కానీ రూ.100 కోట్ల ఆస్తిని “చంద్రమోహన్” ఎలా పోగొట్టుకున్నారు.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.