Ads
ఐసీసీ ప్రపంచ కప్ 2023 టోర్నీ చివరి దశకి చేరుకుంది. వరుస విజయాలతో దూసకెళ్తున్న భారత జట్టు తొలి సెమీ ఫైనల్లో విజయం సాధించి, ఫైనల్ లో అడుగుపెడతామనే ధీమాతో ఉంది. అయితే ఈ మ్యాచ్ లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనున్న విషయం తెలిసిందే.
ముంబై వాంఖడే స్టేడియంలో జరుగబోయే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా తలపడనున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో లీగ్ స్టేజ్ లో ఓసారి న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్ మరోసారి గెలవాలనుకుంటోంది. గెలవాలంటే న్యూజిలాండ్ బలహీనతల పై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేడు భారత్ తో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. కివీస్ పై భారత్ గెలవాలంటే, ఆ జట్టు బలహీనతలను దెబ్బతీయాల్సి ఉంటుంది. కివీస్ టాప్ ప్లేయర్ కేన్ విలియమ్సన్‌కు ప్రపంచకప్ ముందు గాయం అవడంతో జట్టు టాప్ ఆర్డర్ పై సందేహాలు నెలకొన్నాయి. అయితే డెవాన్ కాన్వేతో పాటు కొత్త ప్లేయర్ రచిన్ రవీంద్ర బాగా ఆడుతున్నాడు. గాయం నుండి కోలుకున్న విలియమ్సన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ మిడిలార్డర్ అంతగా ఆడటం లేదు. ఎక్కువగా టాప్ ఆర్డర్ పైనే న్యూజిలాండ్ ఆధారపడుతుంది. వారిని కట్టడి చేస్తే భారత్ గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయి. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అద్భుతంగా ఆడుతున్నాడు. కానీ మిచెల్ కి సహకరించే మరో మంచి స్పిన్నర్ ఆ జట్టులో లేడు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, ఐష్ సోధీ జట్టుకున్న ఆప్షన్స్. వీరిలో ఐష్ సోధీ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచే ఆడాడు. మిగిలిన వాళ్లంతా ఆల్‌రౌండర్లే. రెండో స్పిన్నర్ లేని కివీస్ బలహీనతను భారత జట్టు ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ ఆడిన 13 వరల్డ్ కప్‌లలో సెమీస్ కి చేరడం ఇది తొమ్మిదోసారి. అయితే 2 సార్లు మాత్రమే ఆ జట్టు ఫైనల్ వెళ్లింది. ఇక ఇప్పటి వరకు ఆ జట్టు ప్రపంచ కప్ ను సాధించలేదు. వాంఖడే స్టేడియంలో భారత అభిమానుల ముందు భారత్ తో పోరాడాల్సి రావడం న్యూజిలాండ్ పై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి ఆ ఒత్తిడిని భారతజట్టు తమ ఆటతో మరింత పెంచితే తప్పకుండా గెలుపు టీమిండియాదే అవుతుందని సూచిస్తున్నారు.
Ads
Also Read: ఆ బౌలర్ ఈ పద్ధతి మార్చుకోకపోతే.. అతని వల్లే సెమీస్ లో ఓడిపోయేలా ఉన్నాం..!