Ads
హన్సిక గతంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. అయితే ఇటీవల కాలంలో ఆమె కోలీవుడ్ కే పరిమితమయ్యింది. నేడు ఆమె నటించిన తెలుగు మూవీ `మై నేమ్ ఈజ్ శృతి’ రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- చిత్రం : మై నేమ్ ఈజ్ శృతి
- నటీనటులు : హన్సిక మోత్వాని, పూజా రామచంద్రన్, రాజా రవీంద్ర, ఆడుక్కాలమ్ నరేన్, మురళీ శర్మ, జయప్రకాష్, ప్రేమ, వినోదిని, ఆర్ నారాయణ్, సాయి తేజ్, తదితరులు..
- నిర్మాత : బురుగు రమ్య ప్రభాకర్
- దర్శకత్వం : శ్రీనివాస్ ఓంకార్
- సంగీతం : మార్క్ కె రాబిన్
- సినిమాటోగ్రాఫర్: కిశోర్ బోయిడపు
- విడుదల తేదీ : నవంబర్ 17, 2023
స్టోరీ :Ads
శృతి (హన్సిక మోత్వానీ) కార్పొరేట్ సంస్థలో యాడ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తుంటుంది. ఆమె చరణ్ (సాయి తేజ)ను ప్రేమిస్తుంది. ఆ తరువాత చరణ్ తనను మోసం చేసి తన ఫ్రెండ్ తో డేటింగ్ చేస్తున్నాడని తెలుస్తుంది. నిజం బయటపడడంతో అతనితో గొడవ పడుతుంది. అనంతరం శృతి ఉంటున్న ఫ్లాట్‌లో అను (పూజా రాంచంద్రన్) అనే అమ్మాయి శవం బయటపడుతుంది. దాంతో పోలీసులు శృతిని అరెస్ట్ చేస్తారు.
మరో వైపు ఆమెని ఎమ్మెల్యే గురుమూర్తి (అడుక్కాలమ్ నరేన్) అనుచరులు చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. అరెస్ట్ అయిన తర్వాత శృతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? పోలీస్ ఆఫీసర్ రంజిత్ (మురళీ శర్మ) శృతి నుంచి ఎలాంటి సమాచారం తెలుసుకున్నాడు? గురుమూర్తికి, స్క్రిన్ స్పెషలిస్టు కిరణ్మయి (ప్రేమ)కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ మిస్టరీలో శృతి ఆమె బావ(ప్రవీణ్)ని ఎందుకు సందేహించింది? అనేది మిగిలిన కథ.
రివ్యూ :ఈ మూవీలో స్కిన్ మాఫియా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అయితే తెరకెక్కించిన విధానం కొంచెం పాతదే. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. గజిబిజిగా ఉన్నా, ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండాఫ్ మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్‌లో ఉంటుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఉంటాయి.
ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, హీరోయిన్ హన్సిక మోత్వాని పాత్ర బలంగా నిలిచింది. గ్లామర్, నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో చక్కగా నటించింది. ఎమోషనల్ సన్నివేశాలలో ఆమె నటన బాగుంది. మురళీ శర్మ, ఆడుక్కాలమ్ నరేన్ క్యారెక్టర్స్ ఇంటెన్స్‌గా సాగాయి. విలన్ రోల్‌లో పూజా రామచంద్రన్ కొత్తగా కనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
ప్లస్ పాయింట్స్ : - హన్సిక మోత్వాని
- స్క్రీన్ ప్లే
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- క్లైమాక్స్ ట్విస్ట్మైనస్ పాయింట్స్:
- కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయిరేటింగ్ :
2.75/5ట్యాగ్ లైన్ :
మై నేమ్ ఈజ్ శృతి మూవీ ట్విస్టులతో సాగే మర్డర్ మిస్టరీ. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది.
Also Read: RX 100 కాంబో ఈసారి థ్రిల్లర్ “మంగళవారం” తో హిట్ కొట్టారా.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!