Ads
ఎఫ్3 మూవీ తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా ఏడాది తరువాత స్పార్క్ లైఫ్ అనే సినిమాలో నటించింది. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తూ, విక్రాంత్ హీరోగా నటించాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
- చిత్రం : స్పార్క్ లైఫ్
- నటీనటులు : విక్రాంత్ రెడ్డి, మెహ్రీన్ పిర్జాదా, రుక్సార్ ధిల్లాన్, నాజర్, వెన్నెల కిషోర్, సుహాసిని, శ్రీకాంత్ అయ్యంగార్
- నిర్మాత : లీలా రెడ్డి
- దర్శకత్వం : విక్రాంత్ రెడ్డి
- సంగీతం : హేషమ్ అబ్దుల్ వహాబ్
- విడుదల తేదీ : నవంబర్ 17, 2023
స్టోరీ: లైఫ్ లో ఉన్నతస్థాయికి ఎదగాలని కలలు కనే అమ్మాయి మెహ్రీన్. వాటిని నిజం చేసుకోవాలని అనుకునే సమయంలో ఆమె లైఫ్ లో హీరో విక్రాంత్ ఎంట్రీ ఇస్తాడు. ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఆ తరువాత మరో హీరోయిన్ రుక్సార్ ధిల్లాన్ బస్ స్టాప్ లో చూసి ప్రేమిస్తాడు. ఆమె వెంట పడి ప్రేమించేలా చేసుకుంటాడు. ఇలా ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తుండగా, మరోవైపు సిటీలో ఒకరి తరువాత మరొకరు అమ్మయిలు వరుసగా హ-త్యకు గురి అవుతుంటారు.
పోలీసులు హంతకుడి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ క్రమంలో హత్యలు చేసింది విక్రాంత్ అని తెలుస్తుంది. హీరో ఆ అమ్మాయిలను ఎందుకు చంపాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? మరో హత్య చేయకుండా హీరోని ఆపారా? ఇద్దరు హీరోయిన్లను ఎందుకు ప్రేమించాడు? చివరకు ఏం జరిగింది అనేది మిగిలిన కథ.
రివ్యూ: స్పార్క్ లైఫ్ మూవీ ఎమోషనల్ జర్నీ. హీరోనే అమ్మాయిలను ఎందుకు మర్డర్ చేస్తాడు అని వేటాడే స్టోరీ ఇది. ఎంచుకున్న పాయింట్ బాగున్నా, మూవీని, హీరోని విలన్ గా చూపించిన విధానం మాత్రం ఒక వర్గం ఆడియెన్స్ కు మాత్రం నచ్చేలా ఉంది. సైకో విలన్, థ్రిల్లర్ మూవీలను చూసేవారికి ఇది ఒకే అనిపించవచ్చు. సెంటిమెంట్ జోడించే ప్రయత్నం చేసినా సింక్ కాలేదు.
నటీనటుల విషయానికి వస్తే, విక్రాంత్ మొదటి సినిమా అయిన సహజంగా నటించాడు. మెహ్రీన్ పిర్జాదా ఆకట్టుకుంది. రుక్సార్ ధిల్లాన్ తన పాత్రకు తగ్గట్టుగా నటించింది. ఇతర నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. నేపథ్య సంగీతాన్ని అందించిన హేషమ్ అబ్దుల్ వహాబ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు సమకూర్చారు.
ప్లస్ పాయింట్స్ : - ఎంచుకున్న పాయింట్
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
Ads
- కథలో సంక్లిష్టత,
- కొన్ని సన్నివేశాలు
రేటింగ్ :
1.5/5
ట్యాగ్ లైన్ :
సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ మూవీ నచ్చే అవకాశం ఉంది.
Also Read: “My Name Is Shruthi” REVIEW: హన్సిక నటించిన ఈ కొత్త సినిమా ఎలా ఉంది..? స్టోరీ రివ్యూ & రేటింగ్..!