Ads
నిన్న జరిగిన వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన భారత్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇండియా గెలవడానికి గల కారణం పిచ్ మార్చడం అని బీసీసీఐ కావాలని పిచ్ మార్చేసింది అంటూ పలువురు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి యూకే కి చెందిన పలు పత్రికలు కథనాలు కూడా ప్రచురించాయి. అయితే దీనిపైన ఐసీసీ స్పందించింది.
స్వతంత్ర సలహాదారుడు అండీ అట్కిన్సన్ కు సమాచారం ఇచ్చిన తర్వాతే పిచ్ మార్చినట్లుగా ఐసిసి పేర్కొంది. సుదీర్ఘంగా సాగే టోర్నమెంట్ లో పిచ్ ల మార్పు సర్వసాధారణమని తెలిపింది. వాంఖడే స్టేడియం క్యూరేటర్ సలహాతో ఆతిథ్య దేశం సమన్వయంతో పిచ్ మార్పు జరిగిందని తెలిపింది. ఐసీసీ నిబంధనల ప్రకారం పిచ్ ఎంపిక, తయారీ అన్ని ఆతిథ్య దేశానివే.
నాకౌట్ మ్యాచ్ లను కొత్త పిచ్ పైనే ఆడించాల్సిన అవసరం లేదు.బీసీసీఐ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పిచ్ వివాదం పై ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. ఐసీసీ పై తమకు నమ్మకం ఉందని చెప్పాడు. ఈ మెగాటోర్నీలో ఇప్పటి వరకు తాము ఎలాంటి సమస్యను ఎదుర్కొన లేదని చెప్పాడు. ఆ వార్తలను తాను చూశానని అన్నాడు. ఐసీసీలో ఒక స్వతంత్ర పిచ్ క్యూరేటర్ ఉంటారని, అతడు రెండు జట్లకు న్యాయం జరిగేలా చూసుకుంటారని ఖచ్చితంగా తాను అనుకుంటున్నట్లు చెప్పాడు.ఈ పిచ్ వ్యవహారం పైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ కూడా స్పందించాడు. పిచ్ విషయంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, పిచ్ రెండు మ్యాచ్ లు ఆడినట్లుగానే ఉందని, అయినా ఇరు జట్లకు అనుకూలంగానే వ్యవహరించిందని తెలిపాడు.
Ads
దీంతో విమర్శలకు దిగిన అందరికీ మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
పిచ్ మార్చారంటూ వాగిన మూర్ఖులందరూ నోళ్లు మూయాలంటూ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. భారత క్రికెట్‌పై విమర్శలు చేయడం మానుకోవాలని హెచ్చరించాడు. ఒకవేళ పిచ్ మార్చినప్పటికీ టాస్‌కు ముందే రెండు జట్లకు అందుబాటులో ఉందని అన్నారు. ఇన్నింగ్స్ మధ్యలో మార్చలేదని, టాస్ వేసిన తర్వాత మార్చలేదని పేర్కొన్నాడు. సామర్థ్యమున్న జట్టు అయితే ఆ పిచ్‌పై ఆడి గెలుస్తారని, టీమిండియా ఆ పని చేసిందని కొనియాడాడు. కాబట్టి పిచ్‌ల గురించి మాట్లాడడం మానేయాలని సూచించాడు.