Ads
తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. తెలుగు సినిమా స్థాయి అంతర్జాతీయ స్థాయికి చేరింది. డైరెక్టర్లు హీరోలు కొత్తదనాన్ని ప్రయత్నిస్తూ ఆడిమన్స్ ను అలరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు తమను తాము మార్చుకుంటున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక కొత్త ట్రెండ్ వస్తూ ఉంటుంది. దాన్ని మిగతా వాళ్ళు ఫాలో అవుతూ హిట్లు కొడుతున్నారు.
ఇదివరకు సినిమా టైటిల్ విషయంలో పేర్ల ట్రెండ్ ఉండేది. ఇంద్ర, చంటి, వెంకీ, అఖిల్, ధ్రువ, బన్నీ, తేజ్, గబ్బర్ సింగ్ ఇలా టైటిల్ అన్ని హీరో పేర్లతో పెట్టి ఇట్లు కొట్టేవారు. ఆ తర్వాత హీరోయిన్ పేర్ల మీద కూడా ట్రెండ్ వచ్చింది. అరవింద సమేత, సావిత్రి, జ్యోతిలక్ష్మి, సితార, సీత ఇలా ఈ ట్రెండ్ కొన్ని రోజులు కొనసాగింది.
మళ్లీ ఊరు పేర్లు ట్రెండ్ మొదలైంది. మాచర్ల నియోజకవర్గం, భీమవరం బుల్లోడు, గుంటూరు కారం, కేర్ ఆఫ్ కంచరపాలెం, రాజమండ్రి రోజు మిల్క్ ఇలా ఈ ట్రెండ్ కూడా కొనసాగుతుంది.ఇప్పుడు ఏకంగా వారాల పేర్ల మీద సినిమా టైటిల్ పెట్టి ఈ ట్రెండ్ కి తెరతీశారు మన దర్శక హీరోలు.
Ads
మొదటగా ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ అజయ్ భూపతి అదే సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ను మెయిన్ లీడ్ గా పెట్టి మంగళవారం అనే సినిమాని తెరకెక్కించారు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది.
ఇదే కోవలో కొనసాగుతూ నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం అంటూ డిఫరెంట్ టైటిల్ ప్రకటించారు. నానితో అంటే సుందరానికి మూవీ ని తెరకెక్కించిన డైరెక్టర్ వివేకాత్రేయ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నారు. RRR సినిమాను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డివివి మూవీస్ ఈ సినిమాని తెరకెక్కించనుంది. దసరా సందర్భంగా ఈ మూవీ ప్రకటన వచ్చింది.ఇప్పుడు ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తూ మిగతా వారాల పేర్ల మీద కూడా సినిమాలు వస్తాయేమో ఎదురు చూడాలి.