గంగూలీ చేసిన ఈ తప్పు వల్లే 2003 వరల్డ్ కప్ ఫైనల్ లో ఓడిపోయామా..? ఇప్పుడు రోహిత్ అలా చేయకపోతే గెలుపు మనదే..!

Ads

ప్రపంచ కప్ 2023 టోర్నీలో బిగ్‌ ఫైట్‌ ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరుగనుంది. ఈ గ్రాండ్‌ ఫినాలేకు అంతా సిద్ధమైంది. ఫైనల్ లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీ ఫైనల్ లో కివీస్ పై విజయం సాధించి ఇండియా, సౌత్ఆఫ్రికా పై గెలిచి ఆస్ట్రేలియా ఫైనల్స్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

Ads

2003 ప్రపంచ కప్ టోర్నీ ఫైనల్ లో కూడా భారత్, ఆస్ట్రేలియా పోటీపడ్డాయి. అయితే ఆ ఫైనల్ లో భారత్ పై గెలిచి, ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలిచింది. ఆ మ్యాచ్ లో ఓటమి భారత జట్టు చేసిన చిన్న చిన్న పొరపాట్లే కారణం అని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2003 ప్రపంచ కప్ టోర్నీ మొదటి నుండి అద్భుతంగా ఆడిన భారత్ చివరి మ్యాచ్ అయిన ఫైనల్ లో  బోల్తా పడింది. ఈ టోర్నీ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. అప్పుడు నవంబర్ నెలలో కాక ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ టోర్నీ జరిగింది. ఆ సమయంలో ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇక ఫైనల్స్ మ్యాచ్ మార్చి 23, ఆదివారం నాడు జరిగింది. అయితే 2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ కి, ఇప్పుడు జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు మధ్య పోలికలు ఉన్నాయని అంటున్నారు.
2003 వరల్డ్ కప్ టోర్నీలో సచిన్ 673 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ప్రపంచ కప్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్ గా నిలవడమే కాకుండా, 711 చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఆ టోర్నీలో భారత్ రెండుసార్లు ఓడిపోయింది. లీగ్ దశలో ఒకటి , ఫైనల్స్ లో మరొకటి. కానీ ఈ ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా ఫైనల్ కి చేరింది.
2003 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో అప్పటి కెప్టెన్ గంగూలీ చేసిన పెద్ద మిస్టేక్ చేశాడు. టాస్ గెలిచిన గంగూలీ బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ లో ఛేజింగ్ టైమ్ లో ఆటగాళ్ల పై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆ విషయం తెలిసినప్పటికీ గంగూలీ బౌలింగ్ నే ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్ లో భారత్ ఓటమి పాలయ్యింది. అందువల్ల జరగబోయే వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ బౌలింగ్ కాకుండా బ్యాటింగ్ ఎంచుకుంటే మంచిదని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Also Read: “రోహిత్” ఈ విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే…ఫైనల్ లో ఆస్ట్రేలియాతో గెలుపు కష్టమే.?

Previous articleఐశ్వర్యరాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అబ్దుల్ రజాక్.. మండిపడుతున్న అభిమానులు?
Next articleకిక్ సినిమాలో ఇలియానా చెల్లెలు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందో చూడండి.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.