Ads
తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన చిత్రం లియో. అక్టోబర్ 19న పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు భావించారు. కానీ ఊహించని విధంగా ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ చూసింది. సినిమాను చూసిన ప్రతి ఒక్క అభిమాని కూడా తగ్గ సినిమా కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమిళంలో మాత్రమే ఈ సినిమా పరవాలేదు అనిపించేలా కలెక్షన్లను రాబట్టింది. కానీ మిగిలిన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది.
కాగా విక్రమ్ సినిమా తర్వాత దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల రోజే భారీగా విమర్శలు ట్రోలింగ్స్ కూడా వినిపించాయి. సినిమా విడుదలైన రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న పని అంటూ విజయ్ అభిమానులు ఫైర్ అయ్యారు. సినిమా విడదలైన రోజు నుంచి ఇప్పటి వరకు సుమారు రూ. 600 కోట్లుకు పైగా కలెక్షన్స్ వచ్చాయని మేకర్స్ ప్రకటిచారు. కానీ అందులో నిజం లేదని నెటిజన్లు పలు కామెంట్లు చేశారు. రజనీకాంత్, అజిత్ ఫ్యాన్స్ కావాలనే సినిమాపై నెగటివ్ ప్రచారం చేశారని విజయ్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.
Ads
ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా విడుదల అయి కనీసం నెలరోజులు కూడా కాకముందే ఈ సినిమాను మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారట. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా. అవునండోయ్ తమిళనాడు లో ఈ సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. 100 థియేటర్స్‌లలో లియోను మళ్లీ విడుదల చేయబోటున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం గత రెండు వారులుగా తమిళనాడులో విడుదలైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ సినిమాల కోసం లియోను చాలా చోట్ల తొలగించేశారు.
ప్రస్తుతం ఆ సినిమాలు కూడా డిజాస్టర్ బాట పట్టడంతో థియేటర్లకు ప్రేక్షకులు కరవయ్యారు. దీంతో లియో సినిమాను రీ రిలీజ్ చేస్తే మళ్లీ థియేటర్లు కలెక్షన్స్ బాట పట్టే ఛాన్స్ ఉందని వారు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఈ నెల 17 న ఓటిటిలో రిలీజ్ అవుతుంది అని ముందుగా ప్రకటించారు. కానీ నవంబర్ 23 కి పోస్ట్ పోన్ అయ్యింది. ఈ లోపు ఈ రీరిలీజ్ అని వైరల్ అవుతుంది.