Ads
ఎంతో ఉత్కంఠతో టీం ఇండియాకి, ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచి కప్ ని ఇంటికి తీసుకెళ్లింది. ఆస్ట్రేలియా కప్ గెలవడం ఇది ఆరవ సారి. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు, 50 ఓవర్లలో 240 పరుగుల స్కోర్ చేసింది.
ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, 4 ఓవర్లలో 241 పరుగులు చేసి కప్ గెలుచుకుంది. ఇప్పటి వరకు టీం ఇండియా ఆడిన ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇండియా ఈసారి ఎలాగైనా కప్ కొడుతుంది అని చాలా నమ్మకంగా ఉన్నారు. కానీ అభిమానుల ఆశలు అన్ని ఆశలుగానే మిగిలిపోయాయి.
Ads
ఇది ఇలా ఉంటె…సెమిఫైనల్ తర్వాత అయినా ఒక నిర్ణయం మార్చుకొని ఉంటె పరిస్థితి వేరే లాగా ఉండేది అనుకుంట. భారత్ లీగ్ స్టేజ్ లో 9 మ్యాచ్ లు ఆడి, అన్ని గెలిచింది. సెమీస్ లో న్యూజిలాండ్ ప్రతిఘటించినా షమీ బౌలింగ్ వల్ల గెలిచి, ఫైనల్ కి చేరుకుంది. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరం అయినప్పటి నుండి ఐదుగురు బౌలర్లతో ఆడింది. అయితే లీగ్ స్టేజ్ లో అంతగా ఇబ్బందులు ఎదురుకోలేదు…కానీ సెమీ ఫైనల్ మ్యాచ్ లో బౌలింగ్ విషయంలో భారత్ ఇబ్బంది పడింది. ఈ జట్టులో ఐదుగురు బౌలర్లు మాత్రమే ఉన్నారు. ఇంకో బౌలింగ్ ఆప్షన్ లేదు. టీమిండియా 50 ఓవర్లను బుమ్రా, షమీ,సిరాజ్, జడేజా, కుల్దీప్ లే వేయాల్సి ఉంటుంది.
ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఆడబోతున్నది 5 సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాతో అని తెలుసు..సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికాపై ఆస్ట్రేలియా వాళ్ళు ఎలా ఆడారో తెలుసు. దీంతో సూర్య స్థానంలో అశ్విన్ ని ఆడిస్తే మంచిది అని క్రికెట్ ఫాన్స్ అనుకున్నారు. కానీ రోహిత్ మాత్రం నిర్ణయం మార్చుకోలేదు. బ్యాటింగ్ లైనప్ కావాలని సూర్య ని ఆడించాడు. కానీ అతను బ్యాట్ తో ఫ్లాప్ అయ్యాడు. మరోపక్క ఇంకో బౌలర్ ఆప్షన్ లేకుండా అయ్యింది. అశ్విన్ ఉండి ఉంటే ఇండియా గెలిచేది ఏమో.? వికెట్స్ పడకొట్టేవాడు ఏమో అని ఇప్పుడు ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.