Ads
2023 వన్డే క్రికెట్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిచి వరల్డ్ కప్ ను సొంతం చేసుకుంది. అయితే ఆస్ట్రేలియా కి వరల్డ్ కప్ అంత ఈజీగా ఏమీ దక్కేయలేదు. వాళ్లు కూడా వరల్డ్ కప్ కోసం బాగా కష్టపడ్డారు. లీగ్ దశలో ఆస్ట్రేలియా రెండు మూడు మ్యాచ్ లు ఓడిపోయినా కూడా తిరిగి పుంజుకుని ఈరోజు విశ్వవిజేత అయ్యారు. అయితే ఆస్ట్రేలియా టీం విజయానికి మెయిన్ కారణం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం.
ప్రతి ప్లేయర్ కూడా తమ 100 పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు. ఫైనల్ మ్యాచ్ అనేసరికి ఆస్ట్రేలియా ప్లేయర్స్ కి పూనకం వచ్చేస్తుందేమో అన్నట్టు ఆడతారు. ఫైనల్ మ్యాచ్ లో కూడా అదే కనిపించింది గ్రౌండ్ లో అయినా, బ్యాటింగ్ లో అయినా, బౌలింగ్ లో అయినా కూడా విజృంభించేశారు. ఇండియన్ టీం కి ఏ దశలో అవకాశం ఇవ్వలేదు. ఒకరు ఫెయిల్ అయిన చోట మరొకరు వచ్చి నిలబడిపోయారు.
Ads
అయితే ఈ విజయం వెనుక సంవత్సరాలు కృషి ఉంది. ఎన్నో శాక్రిఫైసెస్ కూడా ఉన్నాయి. వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తను గత ఏడాది ఒక పోస్ట్ పెట్టాడు.ఆ ఏడాది ఐపీఎల్ మిస్ అయ్యేలా కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఎందుకంటే ముందు ముందు టెస్ట్ ఛాంపియన్ షిప్, ఎషేస్ సిరీస్,అలాగే వరల్డ్ కప్ మ్యాచ్ లు ఉన్నందున తన దృష్టంతా వాటిపైనే ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.ఆ రోజు తను తీసుకున్న నిర్ణయం ఈ రోజు ఫలితం ఇచ్చింది.
ఇదే పని ఇండియన్ టీం మెంబెర్స్ చేసి ఉంటే ఈరోజు ఫలితం వేరేలా ఉండేదని ఇండియన్ టీం అభిమానులు అంటున్నారు. ఐపిఎల్ పై పెట్టిన శ్రద్ధ కీలకమైన టోర్నమెంట్ల మీద పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు.కీలకమైన టోర్నమెంట్ ఉన్నపుడు ప్లేయర్స్ ఐపీఎల్ ఆడకుండా బీసీసీఐ కటిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవరసం ఉంది.ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుకి అలవాటు పడి అసలైన మ్యాచ్ లు వదిలేస్తున్నారు. దాని వల్ల ఫలితం కూడా అలాగే వస్తుంది. ఇక నుండి అయిన కూడా ఐపిఎల్ ను పక్కన పెట్టి ఆట మీద ఫోకస్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.