Ads
టాటా గ్రూప్ కంపెనీల గురించి ప్రత్యేకంగా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా గురించి తెలిసిందే. బిజినెస్ ఎదగాలనుకొనే వారికి ఆయన ఇన్ స్పిరేషన్ అని చెప్పవచ్చు. మనం తాగే టీ పొడి నుంచి విమానాల వరకు చాలా వ్యాపారరంగాల్లో సక్సెస్ అయ్యారు.
అయితే రతన్‌టాటాకు వివాహం కాకపోవడంతో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసులు లేరు. దాంతో సుమారు ఇరవై లక్షల కోట్ల వ్యాపార సంస్థలను రతన్‌టాటా తరువాత ఎవరు ముందుకు తీసుకెళతారనే చర్చలు జరుగుతున్నాయి. అంత సత్తా ఎవరికి ఉందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో జీక్యూ ఇండియా ప్రచురణలో, రతన్‌టాటా ఆయన సోదరుడు నోయెల్‌టాటా కుమారుడు నెవిల్లీ, ఇద్దరు కుమార్తెలు లేహ్, మాయాలకు బిజినెస్ మెలకువలు నేర్పుతున్నట్లుగా వెల్లడించింది. అయితే వారికి టాటాగ్రూప్ సంస్థలను నడిపించే సామర్థ్యం ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. కానీ ఆ సంస్థతో ఆ ముగ్గురికి ఉన్న అనుబంధం, వారి విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలు చూస్తే టాటా వారసత్వాన్ని వారు కొనసాగించగలరని తెలుస్తోంది.
లేహ్ టాటా:
Ads
నోయెల్‌టాటా పెద్ద కుమార్తె లేహ్ మాడ్రిడ్‌లో ఉన్న ఐఈ బిజినెస్ స్కూల్లో చదువును పూర్తి చేశారు. ఆమె అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా తాజ్ హోటల్స్ రిసార్ట్స్ ప్యాలెస్‌లలో కెరిర్ ను మొదలుపెట్టారు. సేల్స్ డిపార్ట్మెంట్ లో కాస్త అనుభవం పొందిన తర్వాత ఆమె టాటా గ్రూప్ కు చెందినటువంటి ఇండియన్ హోటల్ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మాయా టాటా:
నోయెల్‌టాటా రెండవ కుమార్తె మాయా టాటా. ఆమె రతన్ టాటా గైడెన్స్ లో టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో కెరిర్ ను ప్రారంభించారు. మాయా ఇన్వెస్టర్ రిలేషన్స్ రిప్రజంటేటివ్‌గా, పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా వర్క్ చేశారు. యూనివర్శిటీ ఆఫ్ వార్విక్ మరియు బేయెస్ బిజినెస్ స్కూల్లో ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. ఆమె టాటా డిజిటల్ సంస్థలో కీలక పదవిలో పనిచేశారు. అంతేకాకుండా మాయా టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ లోని ఆరుగురు బోర్డు మెంబర్స్ లో ఒకరిగా ఉన్నారు.
నెవిల్లీ టాటా
నెవిల్లే టాటా నోయెల్ టాటా యొక్క చిన్న కుమారుడు. అతను బేయెస్ బిజినెస్ స్కూల్లో చదువు పూర్తి చేశారు. ట్రెంట్ హైపర్‌మార్కెట్ కంపెనీకి సారథ్యం వహిస్తున్నారు. ఈ కంపెనీ టాటా గ్రూప్ బ్రాండ్స్ వెస్ట్‌సైడ్ , స్టార్ బజార్లకు మాతృసంస్థ.
Also Read: ఏంటి “హ్యుండాయ్” కార్లపై లోగోలో ఉన్నది “H” కాదా.? దాని వెనకున్న అర్థం ఏంటంటే.?