Ads
డైరెక్టర్ తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం కోటబొమ్మాలి పీఎస్. ఈ సినిమా నవంబర్ 24 న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయం అన్న అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.
Ads
విడుదల తేదీకి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. త్వరగా ఈ సినిమాను సెన్సార్ సభ్యులు చూసి అభినందించారని, ఇందులో ఉత్కంఠ కలిగించే అద్భుతమైన కథనానికి సెన్సార్ సభ్యులు కూడా ఫిదా అయినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది గా ఈ సినిమాలో కొన్ని డైలాగులు పాలిటిక్స్ కు సంబంధించి ఉండబోతున్నాయట. అయితే సినిమా విడుదలకు ముందే ఈ సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఒకవేళ ముందుగా అనుకున్నట్టుగా సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్ సునామీని సృష్టించడం ఖాయం అని చెప్పవచ్చు. మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి. కాగా ఈ సినిమాను గీత ఆర్ట్స్2 బ్యానర్ పై నిర్మాత బన్నీ వాసు నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న శ్రీకాంత్ ఖాతాలో కూడా మరో హిట్ సినిమా పడ్డట్టే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.